Site icon HashtagU Telugu

WhatsApp Updates : వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. షార్ట్‌కట్‌ను హైడ్‌ చేసే ఫీచర్‌?

WhatsApp Features

Good News For Whatsapp Users.. A Feature To Hide The Shortcut..

New Feature in WhatsApp Update : ఇటీవల కాలంలో వాట్సాప్ వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. నెలలో కనీసం ఐదు ఆరు కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వినియోగదారుల దృష్టిని మరింత ఆకర్షిస్తోంది వాట్సాప్ (WhatsApp). ఇప్పటికే ప్రైవసీ సెట్టింగ్స్, చాట్, గ్రూప్స్ విషయంలో ఎన్నో రకాల ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ (WhatsApp) సంస్థ తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఆ ఫీచర్ ఏంటి? దానిని ఎలా ఉపయోగించాలి అన్న వివరాల్లోకి వెళితే.. తాజాగా వాట్సాప్ చాట్స్ ట్యాబ్ నుంచి మెటా ఏఐ షార్ట్‌కట్‌ను హైడ్‌ చేసే ఫీచర్‌ను పరిచయం చేసింది.

We’re Now on WhatsApp. Click to Join.

యూజర్లు చాట్స్ ట్యాబ్ నుంచి నేరుగా AI- పవర్డ్ చాట్‌లను యాక్సెస్ చేయడానికి వీలుగా మెటా ఈ షార్ట్‌కట్‌ను క్రియేట్‌ చేసింది. అయితే దీనిపై చాలా మంది యూజర్ల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఈ షార్ట్‌కట్‌ను హైడ్‌ చేసుకునే ఆప్షన్‌ను వాట్సాప్ తాజాగా రిలీజ్ చేసింది. కాగా రెగ్యులర్‌ యాప్‌ యూసేజ్‌లో AI ఇంటరాక్షన్స్‌ ఇంటిగ్రేట్‌ చేయడానికి గతంలో షార్ట్‌కట్‌ ఇంప్లిమెంట్‌ చేశారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ లో అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్‌ 2.23.25.15 లేటెస్ట్‌ వాట్సాప్‌ బీటా ఇన్‌స్టాల్ చేసిన వారికి, షార్ట్‌కట్‌ను హైడ్‌ చేసే ఫీచర్‌ లాంచ్ అయిందని రిపోర్ట్ పేర్కొంది. చాట్‌ సెట్టింగ్స్‌ లో కొత్త టోగుల్ అందుబాటులో ఉంటుంది.

దీని ద్వారా మునుపటి అప్‌డేట్‌లో విడుదలైన చాట్స్ ట్యాబ్ నుంచి మెటా ఏఐ చాట్‌ను ఓపెన్‌ చేసే షార్ట్‌కట్‌ను యూజర్లు డిసేబుల్‌ చేయవచ్చు. మెటా ఏఐ అసిస్టెంట్‌తో చాట్‌ను ఓపెన్‌ చేయడానికి షార్ట్‌కట్‌ కనిపించాలంటే ఈ టోగుల్ చాలా ముఖ్యం. ఇప్పుడు యూజర్లకు దీన్ని డిసేబుల్‌ చేసే ఆప్షన్‌ కూడా లభించింది. అయితే యూజర్లకు ఇప్పటికే ఏఐ చాట్‌లకు యాక్సెస్ ఉంటే మాత్రమే ఈ షార్ట్‌కట్ అందుబాటులో ఉంటుంది. లేకపోతే, ఇంకొన్నాళ్లు యాప్ ఫ్యూచర్‌ అప్‌డేట్‌ కోసం వేచి చూడక తప్పదు. కాగా మెటా ఏఐ షార్ట్‌కట్‌ను చాట్స్ ట్యాబ్ నుంచి హైడ్‌ చేసే ఆప్షన్‌ ప్రస్తుతం గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి లేటెస్ట్‌ వాట్సాప్ ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసే స్పెసిఫిక్‌ బీటా టెస్టర్‌లకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ రాబోయే కొద్ది రోజుల్లో మరింత మంది యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Also Read:  Black Carrot Benefits: బ్లాక్ క్యారెట్ తో బోలెడు ప్రయోజనాలు.. బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..!