Site icon HashtagU Telugu

E-Scooter: “ఈ-స్కూటర్” కొంటే ఫారిన్ టూర్ ఫ్రీ.. ఏమిటి? ఎక్కడ?

Foreign Tour Free If You Buy E-Scooter .. What Where

Foreign Tour Free If You Buy E Scooter .. What Where

ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే థాయిలాండ్‌ లో నాలుగు రోజుల టూర్ కు వెళ్లే ఛాన్స్ దొరుకుతుందట. ఇంతకీ ఏమిటా స్కూటర్..? ఎందుకా ఆఫర్..? మీరు విన్నది నిజమే.. ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల (E-Scooter) తయారీ కంపెనీ ఒకాయ (Okaya) ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది. కచ్చితమైన క్యాష్‌బ్యాక్ ను కూడా ఈ సంస్థ అందిస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్ (E-Scooter) కొనుగోలుపై రూ. 5 వేల క్యాష్‌బ్యాక్‌తో సహా వివిధ బహుమతులను గెలుచుకునే అవకాశాన్ని సంస్థ కల్పిస్తోంది.

ఫ్రీ.. 4 రోజుల టూర్

ఇందులో లక్కీ విన్నర్ గా ఎంపికయ్యే వారు థాయిలాండ్‌ లో మూడు-రాత్రులు గడపొచ్చు. మొత్తం నాలుగు రోజుల థాయిలాండ్‌ టూర్ కు వెళ్ళొచ్చే ఛాన్స్ కల్పిస్తారు. కార్నివాల్ ఆఫర్ బ్రాండ్ నుంచి అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఇది వర్తిస్తుందని కంపెనీ వెల్లడించింది.మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. నాలుగు రోజుల టూర్ లో అన్ని రకాల వసతులను సంస్థ కల్పించనుంది.

స్క్రాచ్ కార్డ్‌ ద్వారా విన్నర్ ఎంపిక

దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్నివాల్‌లో ఒకాయా బ్రాండ్‌ కు చెందిన ఏదైనా డీలర్ నుంచి లేదా షోరూమ్ లో ఈ సూపర్ డూపర్ స్కూటర్స్ ని కొనుగోలు చేసిన వినియోగదారులు దీనికి అర్హులని ఒకాయ చెప్పింది. కొనుగోలు పూర్తయిన తర్వాత, కొనుగోలుదారు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్‌ లో లింక్‌ ను పొందుతారని వివరించింది. అనంతరం అవసరమైన వివరాలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. అనంతరం కంపెనీ తీసే స్క్రాచ్ కార్డ్‌ లో విజేతను ప్రకటించే అవకాశం ఉంది.

అదిరే కలర్లలో స్కూటర్..

లో-స్పీడ్, హై-స్పీడ్ లలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఒకాయా అందిస్తుంది. వీటిలో Faast F4, Faast F3, Faast F2F, ClassIQ+, Freedum, Faast F2B వంటి మోడల్స్ ఉన్నాయి. మొత్తం 6 కలర్లలో ఈ స్కూటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సియాన్, మ్యాట్ గ్రీన్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్ కలర్లలో స్కూటర్స్ అందుబాటులో ఉన్నాయి.కంపెనీ నుంచి తాజాగా వచ్చిన ఒకాయా ఫాస్ట్ 2 ఫాస్ట్ ధర ₹84,000 (ఎక్స్-షోరూమ్). విద్యార్ధులు, యువకులు, గృహినులను లక్ష్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రూపకల్పన చేసినట్లు సంస్థ తెలిపింది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే దాదాపు 70-80 కిలోమీటర్లు ఈ స్కూటర్ ప్రయాణిస్తుంది. ఏదైనా లోడ్ తో ఉన్నప్పుడు గరిష్టంగా 55 కిమీ/గం వేగంతో ఇది ప్రయాణించగలదు.

అడ్వాన్స్డ్ టెక్నాలజీతో..

  1. Okaya Faast F2Fలో టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ రియర్ షాక్ అబ్జార్బర్స్‌ అమర్చబడి ఉన్నాయి.
  2. ఇది రిమోట్ ‘కీ’, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, DRL హెడ్‌ ల్యాంప్‌ లు, ఎడ్జీ టెయిల్‌ ల్యాంప్స్ వంటి ఫీచర్లతో వస్తుంది.
  3. దేశవ్యాప్తంగా 550 కంటే ఎక్కువ అవుట్‌లెట్లలో ఒకాయా ఎలక్ట్రిక్ వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి.
  4. ఎలక్ట్రిక్ స్కూటర్ 800W-BLDC-హబ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది.
  5. ఇది 60V36Ah (2.2 kWh) లిథియం అయాన్ – LFP బ్యాటరీతో జత చేయబడింది.
  6. బ్యాటరీ మోటారుపై రెండు సంవత్సరాల వారంటీని ఒకాయా కల్పించనుంది.

Also Read:  Software Updates: మొబైల్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?