Flipkart Diwali sale: ఈనెల 19 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ న్యూ బిగ్ దివాళీ సేల్‌..!

ఫ్లిప్‌కార్ట్ న్యూ బిగ్ దీపావళి సేల్ ఈవెంట్ ను మరోసారి వినియోగదారులకు అందించనుంది. అక్టోబర్ 19న ప్రారంభమై అక్టోబర్ 23 వరకు ఈ ఈవెంట్ కొనసాగుతుంది. కంపెనీ ఇటీవల తన దీపావళి విక్రయాలను ముగించింది.

Published By: HashtagU Telugu Desk
Flipkart Platform Fee

Flipkart Platform Fee

ఫ్లిప్‌కార్ట్ న్యూ బిగ్ దీపావళి సేల్ ఈవెంట్ ను మరోసారి వినియోగదారులకు అందించనుంది. అక్టోబర్ 19న ప్రారంభమై అక్టోబర్ 23 వరకు ఈ ఈవెంట్ కొనసాగుతుంది. కంపెనీ ఇటీవల తన దీపావళి విక్రయాలను ముగించింది. అయితే వినియోగదారులకు తక్కువ ధరలకు ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం కల్పించేందుకు ఫ్లిప్‌కార్ట్ మరో విక్రయాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్లస్ మెంబర్‌షిప్ ఉన్నవారు ఒక రోజు ముందుగానే సేల్ ఈవెంట్‌ను యాక్సెస్ చేయగలరు. అంటే అక్టోబర్ 18 నుంచి ఈ ఈవెంట్ లో ప్లస్ మెంబర్షిప్ ఉన్నవారు వస్తువులు కొనుగోలు చేయొచ్చు.

గత సేల్స్ లో ఉన్న డీల్స్ ఈ సేల్ లో కూడా ఉండే అవకాశముంది. పండుగ వేడుకల్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ మొదట బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. వినియోగదారులు బుధవారం నుండి ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై ప్రత్యేకమైన డీల్‌లను పొందవచ్చు. ఈ సేల్ లో పోకో X4, ఇతర స్మార్ట్‌ఫోన్లపై 45 శాతం వరకూ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తున్నట్టు ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌22+ ప్లస్‌, ఐఫోన్‌ 13 వంటి ఫోన్లపై భారీ తగ్గింపులు ఉంటాయి. అయితే.. టీవీలు కొనుగోలు చేయాలనుకునేవారికి 80 శాతం వరకూ ఆఫర్లు ఉండనున్నాయి.

ఎంపిక చేసిన స్మార్ట్‌వాచ్‌లపై 20 శాతం తగ్గింపుతో పాటు ల్యాప్‌టాప్‌లపై కూడా తగ్గింపు ఉంటుంది. HP i3 ల్యాప్‌టాప్ 512GB వేరియంట్‌తో రూ. 35,990కి అందుబాటులో ఉండనుంది. అయితే Lenovo Ryzen 5 ధర రూ.44,9990, శాంసంగ్‌ IPS మానిటర్లు రూ. 7,649 ప్రారంభ ధరతో విక్రయించబడతాయని, ఇది బ్యాంక్ ఆఫర్లపై ఆధారపడి ఉంటుందని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. Realme నుండి వచ్చిన టాబ్లెట్‌లతో సహా కొన్ని టాబ్లెట్‌లు ధర రూ. 8,999 రూపాయలకు విక్రయించబడతాయి. దీపావళి సేల్ సందర్భంగా, Flipkart SBI బ్యాంక్ కార్డ్‌లు, Paytm లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తుంది.

 

 

  Last Updated: 17 Oct 2022, 05:44 PM IST