Elon Musk: అలాంటి బాధను అనుభవించిన ఎలాన్ మస్క్.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ప్రపంచ కుబేరుల జాబితాలో అనూహ్యంగా టాప్ స్థానానికి చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన ఎలాన్ మస్క్ గురించి మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం.

  • Written By:
  • Publish Date - January 23, 2023 / 09:54 PM IST

Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితాలో అనూహ్యంగా టాప్ స్థానానికి చేరుకొని అందరినీ ఆశ్చర్యపరిచిన ఎలాన్ మస్క్ గురించి మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ట్విట్టర్ కంపెనీని కొనుగోలు చేయడం, తర్వాత అందులోని సగానికి పైగా ఉద్యోగులను తొలగించడంతో ఎలాన్ మస్క్ పేరు ఒక్కసారిగా వార్తల్లో టాప్ స్థానానికి చేరింది. టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలను కలిగి ఉన్న ఎలాన్ మస్క్.. తన జీవితంలో అనుభవించిన బాధాకరమైన క్షణాలను వివరించాడు.

తాను ఒక స్థాయిలో చనిపోతానేమో అని అనుకున్నానంటూ ఎలాన్ మస్క్ తన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. తాను కోవిడ్ రెండో డోస్ తీసుకున్న తర్వాత చాలా ఇబ్బందిపడ్డానని, మొదటి డోస్ తో తాను ఇంత ఇబ్బంది పడలేదని తాజాగా ఎలాన్ మస్క్ తన రెండో డోస్ అనుభూతిని పంచుకున్నాడు. కోవిడ్ రెండో డోస్ తీసుకోవడం తనను ఎంతలా బాధించిందో వివరించాడు.

జర్మనీలోని టెస్లా గిగా ఫ్యాక్టరీని సందర్శించడానికి వెళ్లనిప్పుడు రెండో డోజ్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్న ఎలాన్ మస్క్.. కోవిడ్ రెండో బూస్టర్ డోస్ తీసుకున్న తర్వాత చనిపోతానేమో అని అనిపించిందని వివరించాడు. చాలా బాధను అనుభవించానని, మొదటి డోస్ తో ఇంత ఇబ్బంది అనిపించలేదని తెలిపాడు. కానీ రెండో డోస్ తర్వాత చాలా ఇబ్బంది పడ్డానని.. దీని ప్రభావం చాలారోజుల వరకు ఉండిందని అన్నాడు. అయితే ఆ ప్రభావం క్రమంగా తగ్గిపోయిందని వివరించాడు.

తాను మొదటి డోస్ తీసుకున్నప్పుడు పెద్దగా ఇబ్బంది పడలేదని కానీ రెండో డోస్ తీసుకున్న తర్వాత మాత్రం తీవ్రమైన కండరాల నొప్పులు, ఒళ్లు మంటలతో బాధపడట్లు ఎలాన్ మస్క్ వివరించాడు.తన బంధువుల్లో ఒక యువకుడు కూడా అచ్చం తనలాంటి బాధనే అనుభవించాడని తెలిపాడు. కాగా కోవిడ్ రెండో డోస్ తనకు మాత్రం నరకం చూపించిందని ఎలాన్ మస్క్ పరోక్షంగా వివరించాడు.