X Sold To xAI : అమెరికాకు చెందిన వరల్డ్ నంబర్ 1 సంపన్నుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (ట్విట్టర్)ను ‘ఎక్స్ ఏఐ’ (xAI)కు అమ్మేశారు. ఈ డీల్ విలువ దాదాపు రూ.2.82 లక్షల కోట్లు (33 బిలియన్ డాలర్లు). ఈవివరాలను తెలుపుతూ ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ‘‘xAI కంపెనీకి అధునాతన AI సామర్థ్యం ఉంది. దాని నైపుణ్యాలతో X పరిధి మరింతగా విస్తరిస్తుంది’’ అని ఆయన వెల్లడించారు. ‘‘Xకి ప్రస్తుతం 60 కోట్ల మందికిపైగా వినియోగదారులు ఉన్నారు. రెండేళ్ల క్రితమే ప్రారంభమైన xAIపై X భవితవ్యం ఆధారపడి ఉంటుంది’’ అని మస్క్ చెప్పారు. ‘‘X, xAI కంపెనీల డేటా, మోడల్స్, కంప్యూట్, డిస్ట్రిబ్యూషన్, ప్రతిభను కలిపే దిశగా మేం అడుగులు వేస్తున్నాం. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని వేగవంతం చేసే వేదికను నిర్మితం అవుతుంది’’ అని ఆయన తెలిపారు.
Also Read :Maoists Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్.. 16 మంది మావోయిస్టులు హతం
డీల్ లెక్కలు ఇవీ..
ఆల్ స్టాక్స్ డీల్ ద్వారా ఎక్స్‌ను ఎక్స్ ఏఐకి అమ్మేశారు. ఇప్పుడు xAI విలువ 80 బిలియన్ డాలర్లు. X విలువ 33 బిలియన్ డాలర్లు. ట్విట్టర్‌పై ప్రస్తుతం 12 బిలియన్ డాలర్ల రుణం ఉంది. 2022 చివరిలో ట్విట్టర్ (ఎక్స్)ను 44 బిలియన్ డాలర్లకు ఎలాన్ మస్క్ కొన్నారు. అందులోనే 12 బిలియన్ డాలర్ల రుణం కూడా కలిసి ఉంది. ట్విట్టర్ కొన్న మరుసటి సంవత్సరమే xAIని మస్క్ ప్రారంభించారు. ఈ వెంచర్ ద్వారా హై ఎండ్ Nvidia చిప్‌ల తయారీకి బిలియన్ల డాలర్లను ఖర్చు చేశారు. xAI ఈ ఏడాది ఫిబ్రవరిలో దాని ఛాట్‌బాట్ యొక్క తాజా వెర్షన్ గ్రోక్ 3ని విడుదల చేసింది.
Also Read :RSS Hedgewar : ఏప్రిల్ 1న ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవర్ జయంతి.. జీవిత విశేషాలివీ
xAI కంపెనీ ఎవరిది ?
- xAI కంపెనీని(X Sold To xAI) 2023 మార్చిలో ఎలాన్ మస్క్ స్థాపించారు.
- ఈ కంపెనీకి ప్రాథమికంగా యజమాని ఎలాన్ మస్కే.
- ఎక్స్ హోల్డింగ్ కార్పొరేషన్‌కు xAIపై యాజమాన్య హక్కులు ఉన్నాయి. ఇందులో మెజారిటీ వాటా ఎలాన్ మస్క్‌దే.
- అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న బాస్ట్రోప్ నగరం కేంద్రంగా xAI పనిచేస్తోంది.
- 2023 జూన్ నుంచి xAI సీఈఓగా లిండా యాకారినో వ్యవహరిస్తున్నారు.
- xAI కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సీటీఓగా మస్క్ సేవలు అందిస్తున్నారు.
- 2024 నవంబరులో xAI కంపెనీకి సీఎఫ్‌ఓగా మహమూద్ రజా బంకీ జాయిన్ అయ్యారు. ఈయన ఇరాన్ మూలాలు కలిగిన అమెరికన్ శాస్త్రవేత్త.