Blindsight : కంటిచూపు లేని వారికి ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్

Blindsight :  ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ కొత్త కొత్త ఆవిష్కరణలతో యావత్ ప్రపంచం ‘చూపు’ను ఆకట్టుకుంటోంది.

Published By: HashtagU Telugu Desk
Blindsight

Blindsight

Blindsight :  ట్విట్టర్ (ఎక్స్) యజమాని ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీ కొత్త కొత్త ఆవిష్కరణలతో యావత్ ప్రపంచం ‘చూపు’ను ఆకట్టుకుంటోంది. పక్షవాతం రోగుల బ్రెయిన్‌ను యాక్టివ్‌గా మార్చే ఎలక్ట్రానిక్ చిప్‌ను ఇప్పటికే న్యూరాలింక్ తయారు చేసింది. దానితో అమెరికాలో మనుషులపై ప్రస్తుతం ప్రయోగ పరీక్షలు చేస్తోంది. ఈ చిప్‌ను మెదడులో పెట్టించుకున్న ఓ వ్యక్తి సానుకూల ఫలితాలను పొందాడంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక కంటిచూపు లేని వారికి దోహదపడే మరో ఆవిష్కరణపైనా  న్యూరాలింక్ కంపెనీ పనిచేస్తోంది.  దానిపేరే ‘బ్లైండ్‌సైట్‌’. బ్లైండ్‌సైట్ అనేది కంటిచూపు లేనివారి మానవ గుర్తింపు సామర్థ్యాన్ని పునర్నిర్మించడానికి దోహదం చేయనుంది. ఇది ఎలా పని చేస్తుందో తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగక మానదు.

We’re now on WhatsApp. Click to Join

బ్లైండ్‌సైట్ ఎలా పనిచేస్తుంది ?

కెమెరా వంటి పరికరాన్ని ఉపయోగించి చూపునకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడంతో  బ్లైండ్‌సైట్ టెక్నాలజీ (Blindsight) పనిచేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మెదడుకు అర్థమయ్యేలా మార్చడానికి కంప్యూటర్ ద్వారా ప్రాసెసింగ్ చేస్తారు.  అనంతరం ఆ సమాచారాన్ని న్యూరాలింక్ పరికరానికి లింక్ చేస్తారు. ఇది విజువల్ క్యారెక్టర్స్‌లో వాటిని డిస్‌ప్లే చేస్తుంది. దీని ద్వారా ఆ వ్యక్తికి ఎదురుగా ఉన్న వస్తువులు, వ్యక్తులపై చాలావరకు అవగాహన వస్తుంది.

Also Read : Sarath Chandra Reddy : శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్టు చేశాక.. బీజేపీకి ‘అరబిందో’ 30 కోట్లు

ప్రత్యేకించి జన్యుపరమైన పరిస్థితులు, గాయాలు, అనారోగ్యాల కారణాల వల్ల కంటిచూపు  బలహీనపడిన వారి పాలిట వరంలా బ్లైండ్‌సైట్ టెక్నాలజీ పనిచేస్తుందని పరిశీలకులు అంటున్నారు. కళ్ళు, ఆప్టిక్ నరాల ద్వారా సాంప్రదాయక మార్గాలపై ఆధారపడకుండా నేరుగా మెదడే సమాచారాన్ని స్వీకరించి ప్రాసెస్ చేస్తుంది. అది పంపే సంకేతాల ద్వారా డేటాను వ్యక్తి అర్థం చేసుకుంటాడు.ఇది చూపులేని వారి జీవితాలను ఒక వరంలాంటిది. బ్లైండ్‌సైట్ టెక్నాలజీ డెవలప్మెంట్ ఇంకా తొలిదశలోనే ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించగలిగే దిశగా ప్రయత్నాలు నిరాటంకంగా సాగుతున్నాయి.

Also Read :Manchu Manoj: నేను ఏ రాజకీయ నాయకుడిని ఉద్దేశించి మాట్లాడలేదు: మంచు మనోజ్

  Last Updated: 22 Mar 2024, 01:14 PM IST