WhatsApp: వాట్సాప్ హిస్టరీని కొత్త ఫోన్లోకి మార్చుకోవాలా.. అయితే ఈ టిప్స్ పాటించాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా ఎ

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 08:43 PM IST

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాట్సాప్ వినియోగదారుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వినియోగదారుల సంఖ్య పెరిగిపోతుండడంతో వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో ఫీచర్ లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కూడా మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది వాట్సాప్ సంస్థ. మరి ఆ వివరాల్లోకి వెళితే.. మాములుగా కొంత మంది వినియోగదారులు తమ ఫోన్లను మార్చుతూ ఉంటారు. అలాంటప్పుడు ఒకఫోన్ లోని వాట్సాప్ చాటింగ్ హిస్టరీని మరో ఫోన్లోకి రావాలని కోరుకుంటారు. మరి అలా రావాలంటే ఏం చేయాలి? అందుకోసం ఎలాంటి టిప్స్ పాటించాలో చాలా మందికి తెలియదు. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఒక ఫోన్లోనే వాట్సాప్ చాటింగ్ హిస్టరీని మరొక ఫోన్లోకి మార్చడానికి క్యూఆర్ కోడ్ విధానాన్ని . దీనిని ఆండ్రాయిడ్ యూజర్లతో పాటు ఐఫోన్ వినియోగదారులు కూడా వినియోగించుకోవచ్చు. అయితే ఈ క్యూఆర్ కోడ్ సహాయంతో వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్ ఫర్ చేసుకోవాలంటే మీరు మీ వాట్సాప్ ను తప్పనిసరిగా బ్యాక్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాత ఫోన్లోని వాట్సాప్ కొత్త ఫోన్లోకి హిస్టరీతో సహా తీసుకురావాలంటే మొదటిగా మీరు ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేంటంటే మీ పాత ఫోన్, కొత్త ఫోన్ రెండూ ఒకే విధమైన ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉండాలి. అంటే ఆండ్రాయిడ్ టు ఆండ్రాయిడ్, ఐఓఎస్ టు ఐఓఎస్ కు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు కనీసం 5.1 వెర్షన్ ను కలిగి ఉండాలి. ఐఓఎస్ వినియోగదారులు అయితే 2.23.9.77 వెర్షన్ లేదా అంతకు పైగా ఉన్న వాట్సాప్ వెర్షన్ ను కలిగి ఉండాలి.

అలాగే రెండూ కూడా ఒకటే వైఫై కి కనెక్ట్ అయ్యి ఉండేటట్లు చూసుకోవాలి. వాట్సాప్ హిస్టరీని ట్రాన్స్ ఫర్ లో మీరు చాట్ సమాచారం మొత్తాన్ని బదిలీ చేసుకోవచ్చు. మెసేజెస్, మీడియా ఫైల్స్ వంటివి చేసుకోవచ్చు. అయితే పేమెంట్స్, కాల్ హిస్టరీ మాత్రం ట్రాన్స్ ఫర్ కావని తెలుసుకోవాలి. మీరు ప్రక్రియను ప్రారంభించే ముందు కొత్త ఫోన్లో వాట్సాప్ రిజిస్టర్ కాకుండా చూసుకోవాలి. ఆ ప్రాసెస్ విషయానికి వస్తే.. మొదటి మీ పాత మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. దానిలో మోర్ ఆప్షన్స్ లోకి వెళ్లి సెట్టింగ్స్ ఓపెన్ చేసి, చాట్స్ లోకి వెళ్లాలి. దానిలో ట్రాన్స్ ఫర్ చాట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి స్టార్ట్ బటన్ ను నొక్కాలి. ఇప్పుడు మీరు కొత్త ఫోన్లో వాట్సాప్ ను ఇన్ స్టాల్ చేసి, రిజిస్టర్ చేయండి. అది కూడా మీ పాత ఫోన్లో వాడిన నంబర్ తో నే రిజిస్టర్ అవ్వాలి. తర్వాత స్మార్ట్ అనే బటన్ నొక్కడం ద్వారా పాత ఫోన్లోని చాట్ హిస్టరీ బదిలీ ప్రక్రియను ప్రారంభించండి. కొన్ని పర్మిషన్లు అడుగుతుంది. అవి ఇచ్చాక క్యూఆర్ కోడ్ మీకు కనిపిస్తుంది. దానిని పాత ఫోన్ సాయంతో స్కాన్ చేయాలి. తర్వాత అడిగిన పర్మిషన్ మంజూరు చేస్తే ట్రాన్స్ ఫర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తయ్యాక డన్ బటన్ పై నొక్కాలి.