Earth Vs Asteroids : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు ఆస్టరాయిడ్లు ఒకేసారి కలిసికట్టుగా ఇవాళ (అక్టోబరు 24న) భూమికి అత్యంత చేరువగా రానున్నాయి. ఈ ఆరు ఆస్టరాయిడ్లలో అతిపెద్దది దాదాపు 580 అడుగుల వెడల్పుతో ఉందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ గుర్తించింది. ఇది మన భూమికి దాదాపు 45 లక్షల కి.మీ దూరం నుంచి.. సెకనుకు 4.87 కి.మీ వేగంతో ప్రయాణిస్తుందని తెలిపింది. చిన్న సైజు ఆస్టరాయిడ్లు చాలా స్పీడుగా గమనాన్ని సాగిస్తాయి. సగటున 18 నుంచి 41 మీటర్ల వ్యాసం కలిగిన ఒక ఆస్టరాయిడ్ సెకనుకు దాదాపు 6.9 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ‘2015 హెచ్ఎం1’ అనే పేరు కలిగిన ఒక ఆస్టరాయిడ్ వ్యాసం 24 నుంచి 54 మీటర్ల దాకా ఉంది. అది భూమికి 55 లక్షల కి.మీ దూరం నుంచి సెకనుకు 10.88 కి.మీ వేగంతో జర్నీ చేయనుందని నాసా అంచనా వేస్తోంది.
భూమికి ముప్పు ఉందా ?
భూమికి చేరువగా రానున్న ఆస్టరాయిడ్ల (Earth Vs Asteroids) జాబితాలో 2024 టీపీ17, 2024 టీఆర్6, 2021 యూఈ2 ఉన్నాయని తెలిపింది. వీటన్నింటి సైజు(వ్యాసం) సగటున 30 మీటర్ల నుంచి 92 మీటర్ల మేర ఉంది. ఇవి కూడా భూమి నుంచి సగటున 56 లక్షల దూరం నుంచి రేపు గమనాన్ని సాగించే అవకాశం ఉంది.శుక్రవారం రోజు ఈ ఆస్టరాయిడ్లు భూమికి చేరువ నుంచి గమనం సాగించనున్న నేపథ్యంలో నాసా అలర్ట్ అయింది. వాటి గమనాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. ఈ ఆస్టరాయిడ్ల వల్ల భూమికి ప్రమాదం ఉండకపోవచ్చని నాసా తెలిపింది.
Also Read :Babita Vs Aamir Khan : అమీర్‌ఖాన్‌పై ‘దంగల్’ బబిత సంచలన ఆరోపణలు
ఏమిటీ ఆస్టరాయిడ్లు ?
- ఆస్టరాయిడ్లు ఇప్పటివి కావు. అవి దాదాపు 460 కోట్ల ఏళ్ల క్రితం సౌర వ్యవస్థ ఏర్పాటైన టైంలోనే ఆవిర్భవించాయి.
- ఆస్టరాయిడ్లు పూర్తిగా బండరాళ్లతో నిండి ఉంటాయి.
- కొన్ని ఆస్టరాయిడ్ల సైజు చిన్నగా.. మరికొన్నింటి సైజు పెద్దగా ఉంటుంది. గ్రహాలతో పోలిస్తే వీటి సైజు చాలా చిన్నగా ఉంటుంది.
- ఎక్కువగా ఆస్టరాయిడ్లు.. అంగారకుడు (మార్స్), బృహస్పతి (జూపిటర్) గ్రహాల పరిసరాల్లోనే ఉంటాయని నాసా శాస్త్రవేత్తలు గతంలో గుర్తించారు.
- సౌర వ్యవస్థలో మొత్తం కోట్లాది ఆస్టరాయిడ్లు ఉన్నాయని అంచనా.
- ఒక్కో పెద్ద ఆస్టరాయిడ్ సైజు.. వందల కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుందని అంటారు.