E Bike R.x275: సైకిల్ కాదు.. మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్.. స్పెషాలిటీస్ అదుర్స్

చూడటానికి సైకిల్ లా ఉంది ..కానీ అది సైకిల్ కాదు.. మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్.  ప్రత్యేకంగా రాతి రోడ్లు, రాళ్ళు మరియు ఎత్తైన పర్వతాలపై నడిచేలా దీన్ని డిజైన్ చేశారు.

E Bike R.x275 : చూడటానికి సైకిల్ లా ఉంది ..కానీ అది సైకిల్ కాదు.. మౌంటెన్ ఎలక్ట్రిక్ బైక్.  ప్రత్యేకంగా రాతి రోడ్లు, రాళ్ళు మరియు ఎత్తైన పర్వతాలపై నడిచేలా దీన్ని డిజైన్ చేశారు. శక్తివంతమైన సైకిళ్ల తయారీకి పేరుగాంచిన ” రోట్‌ విల్డ్” (Rotwild) కంపెనీ ” E Bike R.X275″ పేరుతో దీన్ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇందులో 300 వాట్స్ పవర్ మోటార్ ఉంది. దీనిని పాండల్, బ్యాటరీ రెండింటి నుంచి ఫిక్స్ చేయొచ్చు. విశేషమేమిటంటే.. Rotwild R.X275 బరువు కేవలం 15 కిలోలు మాత్రమే. కార్బన్ ఫైబర్ ఫ్రేమ్ కారణంగా దీని బరువు బాగా తగ్గింది. ఇది  50 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇ-బైక్ కేవలం 30 సెకన్లలో వేగం పుంజుకుంటుంది. ఇది ప్రత్యేకంగా ఆఫ్ రోడ్ , చెడు రోడ్ల కోసం రూపొందించబడింది. ఇందులోని eAssist అనే ఫీచర్ మీకు ట్రావెలింగ్ రూట్ ను చూపుతుంది. Rotwild R.X275 Pro ప్రారంభ ధర రూ. 8.5 లక్షలు (ఎక్స్ – షోరూమ్).  అందులో పవర్ సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది.

స్పీడ్ సెట్టింగ్..

R.X275లో మీరు మీ రైడ్ ప్రారంభంలో మీకు కావలసిన మోడ్‌ను సెట్ చేయండి.. మీకు కొంత అదనపు పవర్ కావాలనుకున్నప్పుడు బూస్ట్ స్విచ్‌ని ఉపయోగించండి. మీరు బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్‌ ఫోన్‌లోని గొప్ప TQ యాప్‌తో కూడా ఈ బైక్ యాక్టివిటీని సింక్ చేసుకోవచ్చు.

“ఆడి” ఈ-మౌంటెన్ బైక్‌..

ఆడి ఎలక్ట్రిక్ కంపెనీ ఈ-మౌంటెన్ బైక్‌ను మార్చి మొదటి వారంలో విడుదల చేసింది. ఇందులో నాలుగు సైక్లింగ్ మోడ్‌లు ఉన్నాయి. బూస్ట్, ఎకో, స్పోర్ట్ మరియు టూర్. కొండ మార్గాలలో జర్నీ కోసం ఇది సహాయాన్ని అందజేస్తుంది. దీని హ్యాండిల్‌ బార్‌పై ఉన్న డిజిటల్ డిస్‌ప్లే లో వేగం , బ్యాటరీ లెవల్ వంటి డేటా కనిపిస్తుంది. ఈ-మౌంటెన్ బైక్‌ ‘L,’ ‘M’ మరియు ‘S’ సైజ్ లలో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.7.69 లక్షలు.

Also Read:  Raw Mangoes: వేసవిలో పచ్చి మామిడి పండ్లను తినడం వల్ల కలిగే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు