Smartphone Rankings : భారత్‌లో మార్కెట్ వాటాపరంగా అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు ఏవో తెలుసా ? దీనికి సంబంధించిన ఒక నివేదికను ‘ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్’ (ఐడీసీ) విడుదల చేసింది. జులై – సెప్టెంబరు త్రైమాసిక కాలంలో భారత్‌లో 4.4 కోట్ల స్మార్ట్‌ఫోన్లు సరఫరా అయ్యాయని ఐడీసీ తెలిపింది. పండగ సీజన్ ఉండటంతో గత మూడునెలల్లో స్మార్ట్ ఫోన్ల విక్రేతలు, రిటైలర్లు పెద్ద ఎత్తున స్టాక్‌ను తెప్పించుకున్నారని పేర్కొంది. ఈవిధంగా జరిగిన సప్లై ఆధారంగా భారత్‌లో అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌గా శాంసంగ్ నిలిచింది. మనదేశంలోని మొత్తం స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 16.2 శాతం వాటా దానిదే. ఇంతకుముందు ఫస్ట్ ప్లేస్‌లో వీవో ఉండేది. మళ్లీ ఇప్పుడు వీవోను దాటేసి శాంసంగ్ తొలి స్థానానికి చేరింది.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా రెండో ప్లేస్‌లో నిలిచిన రియల్ మీకి భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 15.1 శాతం వాటా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా వివో (13.9%), షావోమి (11.7%), ఒప్పో (9.9%), వన్‌ప్లస్ (6.2%), పోకో (5.7%), యాపిల్ (5.5%), ఇన్ఫీనిక్స్ (3.1%), టెక్నో ( 2.9%) నిలిచాయి.జులై – సెప్టెంబరు త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్ల సగటు ధర పెరిగింది. మూడు నెలల వ్యవధిలో ఒక్కో యూనిట్ సగటు విక్రయ ధర త్రైమాసికం ప్రాతిపదికన 5 శాతం పెరిగింది. ఈ మూడు నెలల వ్యవధిలో విడుదలైన అత్యధిక స్మార్టఫోన్ల సగటు ధర (Smartphone Rankings) దాదాపు రూ.8,330.