Site icon HashtagU Telugu

Wifi Vs Hackers : వైఫై వాడుతున్నారా ? సేఫ్టీ టిప్స్ తప్పక తెలుసుకోండి

Wifi Vs Hackers

Wifi Vs Hackers

Wifi Vs Hackers : మీరు ఇంట్లో/ఆఫీసులో వైఫై వాడుతున్నారా ? అయితే బీ అలర్ట్ !! ఈ మధ్యకాలంలో  సైబర్ దొంగలు వైఫైలను కూడా హ్యాక్ చేస్తున్నారు. వైఫై రూటర్ల ద్వారా మీ విలువైన ఇంటర్నెట్ డేటాను దొంగిలిస్తున్నారు. అంతేకాదు మన పర్సనల్​ డేటాను కూడా తస్కరించి దుర్వినియోగం చేస్తున్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో వైఫై(Wifi Vs Hackers)  కనెక్షన్ కలిగినవారు పాటించాల్సిన బేసిక్ రూల్స్ గురించి మనం ఈ కథనంలో తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

పాస్‌వర్డ్ చెప్పారా ?

ఒకవేళ వైఫై పాస్​వర్డ్​ను మీరు ఇరుగుపొరుగు వారికి చెబితే.. ఆ పని పూర్తయిన తర్వాత పాస్​వర్డ్​ను మార్చుకోవడం మంచిది. వైఫై రూటర్లలో డీఫాల్ట్​గా రిమోట్ యాక్సెస్​ ఎనేబుల్ అయి ఉంటుంది. మీరు కనుక దాన్ని ఉపయోగించకపోతే, వెంటనే దాన్ని ఆపేయడమే బెటర్.

స్ట్రాంగ్ పాస్‌వర్డ్

మీ రూటర్ సేఫ్‌గా ఉండాలంటే.. మీ వైఫై పాస్​వర్డ్‌లు సేఫ్‌గా ఉండాలి. దీనికోసం మీరు తరుచుగా మీ వైఫై పాస్​వర్డ్​ను మారుస్తుండాలి. స్ట్రాంగ్​ పాస్​వర్డ్​లను సెట్​ చేసుకోవాలి. 8 అక్షరాలు లేదా అంతకంటే పెద్ద అల్ఫాన్యూమరిక్​ పాస్​వర్డ్​ను పెట్టుకుంటే సేఫ్. ‘రూటర్​ పేరు’ కూడా మారుస్తుండాలి. ఇవన్నీ చేస్తే మీ వైఫై శత్రుదుర్భేధ్యంగా మారుతుంది.

లాగిన్

మీ వైఫై రూటర్​ ఇన్​స్టాలేషన్​తో వచ్చే డీఫాల్ట్​ లాగిన్ వివరాలను వెంటనే మార్చుకుంటే బెటర్. ఒకవేళ మీరు ఈవిషయంలో ఆలస్యం చేస్తే.. హ్యాకర్లు చాలా ఈజీగా మీ వైఫై రూటర్​లోని డేటాను దొంగిలిస్తారు.

Also Read : Iran Attack : ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి.. డ్రోన్లు, మిస్సైళ్లతో అర్ధరాత్రి ఎటాక్

యూజర్ల లిస్టు

ఎవరెవరు మీ వైఫై వాడుతున్నారనే లిస్టు మీ స్మార్ట్​ఫోన్​, పీసీ, ల్యాప్​టాప్​, స్మార్ట్​టీవీ, ట్యాబ్లెట్స్, స్మార్ట్​వాచ్‌లలో కనిపిస్తుంది. ఒకవేళ అపరిచిత వ్యక్తులు మీ పాస్​వర్డ్‌ను వాడుతున్నట్లు గుర్తిస్తే.. వెంటనే దాన్ని బ్లాక్​ లేదా డిజేబుల్ చేయాలి. వెంటనే పాత పాస్​వర్డ్​ను మార్చేసి, కొత్త పాస్​వర్డ్​ను​ సెట్ చేయాలి.

ఫైర్​వాల్​ సేఫ్టీ

కొత్తగా వస్తున్న వైఫై రూటర్లు బలమైన ఫైర్‌వాల్‌తో ఇన్‌స్టాల్​ అవుతాయి. ఇవి హ్యాకింగ్​ నుంచి మన వైఫైను కాపాడుతాయి. దాన్ని ఎప్పటికప్పుడు అప్​డేట్ చేస్తుండాలి.

ఫ్రీ వైఫై డేంజర్

పబ్లిక్ వైఫై ఫ్రీగా వస్తోంది కదా అని వాడేయొద్దు. ఒకవేళ మీరు అది వాడితే..  ప్రమాదాలను ఆహ్వానిస్తున్నట్టే లెక్క. సైబర్‌ నేరగాళ్లు  ఈజీగా మీ నెట్‌వర్క్‌లోకి చొరబడి హాట్‌స్పాట్‌ను వినియోగిస్తున్న వారందరి డేటాను దొంగిలిస్తారు.

Also Read :Skipping Breakfast: మీరు ఉద‌యాన్నే బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా..? అయితే డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్లే..!