Atomic Clock : అణు గడియారాన్ని తయారుచేసిన చైనా.. స్పెషాలిటీ ఇదీ

Atomic Clock : చైనా ప్రతీ రంగంలో, ప్రతీ టెక్నాలజీలో దూసుకుపోతోంది.

Published By: HashtagU Telugu Desk
Atomic Clock

Atomic Clock

Atomic Clock : చైనా ప్రతీ రంగంలో, ప్రతీ టెక్నాలజీలో దూసుకుపోతోంది. తాజాాగా ఆ దేశం ఒక అణు గడియారాన్ని(Atomic Clock) కూడా తయారు చేసింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పర్ఫెక్ట్‌గా టైంను చూపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గడియారం ఎంత పర్ఫెక్టు అంటే.. దాదాపు 720 కోట్ల పాటు ఎలాంటి పొరపాటు, తడబాటు లేకుండా టైంను చూపిస్తుంది. అప్పటిదాకా టిక్ టిక్ అంటూ ఈ గడియారం నడుస్తూనే ఉంటుంది. స్ట్రోంటియం, అల్ట్రా స్టేబుల్ అనే లేజర్‌లను ఉపయోగించి దీన్ని  యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనాలోని సైంటిస్టులు తయారు చేశారు. ఇదొక ఆప్టికల్ క్లాక్‌.  దీంతో ప్రపంచంలో ఈ తరహా గడియారాన్ని తయారు చేసిన రెండో దేశంగా చైనా నిలిచింది. ఇందులో చూపించే టైంలో అనిశ్చితి, అస్థిరత అనేది మిగతా సాధారణ గడియారాల కంటే ఐదు క్విన్టిలియన్ల మేర తక్కువగా ఉంటుందట.

We’re now on WhatsApp. Click to Join.

రాబోయే 700 కోట్ల సంవత్సరాలలో ఈ  గడియారం అటూఇటుగా ఒక్క సెకను మాత్రమే సమయంలో పొరపాటు,  తడబాటు చూపించే ఛాన్స్ ఉంటుంది. అంటే మన జీవితకాలమంతా కరెక్టు టైం కోసం ఈ గడియారంపై నిశ్చింతగా ఆధారపడొచ్చన్న మాట. ఇలాంటి ఆప్టికల్ క్లాక్‌లను ఉపయోగించి మరింత ఖచ్చితమైన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్స్ (GPS), క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్‌లను శాస్త్రవేత్తలు అభివృద్ధి  చేస్తారు. అత్యంత కచ్చితమైన పరమాణు గడియారాన్ని అమెరికాలోని బౌల్డర్‌లో ఉన్న కొలరాడో విశ్వవిద్యాలయం సైంటిస్టులు తొలిసారిగా తయారు చేశారు. ఇప్పుడు చైనా ఈ తరహా గడియారాన్ని డెవలప్ చేసింది. జపాన్, జర్మనీ దేశాలు కూడా ఇలాంటి అణు గడియారాల తయారీపై ప్రస్తుతం రీసెర్చ్ చేస్తున్నాయి.

Also Read :Paytm – Ayodhya Offer : 100 శాతం క్యాష్ బ్యాక్.. అయోధ్య యాత్రికులకు పేటీఎం బంపర్ ఆఫర్

పదివేల సంవత్సరాలు నడిచే 500 అడుగుల భారీ గడియారం

పదివేల సంవత్సరాలు నడిచే 500 అడుగుల భారీ గడియారాన్ని నిర్మించేందుకు ప్రముఖ ఈ-కామర్స్‌ కంపెనీ ‘అమెజాన్‌’ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ 42 మిలియన్‌ డాలర్లు (రూ.350 కోట్లు) కేటాయించారు. కంప్యూటర్‌ సైంటిస్టు, ఇన్వెంటర్‌ డానీ హిల్స్‌ ఆలోచనలోంచి పుట్టిన ఈ ప్రాజెక్ట్‌ ‘ద క్లాక్‌ ఆఫ్‌ ద లాంగ్‌ నౌ’. ఏడాదికి ఒకమారు ‘టిక్‌’ అంటూ శబ్ధం చేస్తుంది. ఈ ‘యాంత్రిక గడియారాన్ని’ లాంగ్‌ న్యూఫౌండేషన్‌ అనే సంస్థ టెక్సాస్‌ కొండలపై ఏర్పాటుచేయనున్నది. ఒక గది పరిమాణంలో ఉండే ఐదు ఛాంబర్‌లు ఈ గడియారంలో ఉంటాయి. మొదటి ఏడాది-మొదటి ఛాంబర్‌, 10వ ఏడాది-రెండో ఛాంబర్‌, 100వ ఏడాది-మూడో ఛాంబర్‌, 1000వ ఏడాది-నాలుగో ఛాంబర్‌, 10వేల సంవత్సరం-ఐదో ఛాంబర్‌కు కేటాయించారు. ఆయా కాలాల్లో మానవ చరిత్రని తెలిపే కళాఖండాలు, సందేశాలు.. తదితర అంశాల్ని ఇందులో పొందుపరుస్తారు.

  Last Updated: 30 Jan 2024, 06:09 PM IST