AI Image Creator: ఇది కృత్రిమ మేధ (AI)తో నడిచే యుగం. వైద్య రంగం, విద్యా రంగం నుంచి వ్యవసాయ రంగం, తయారీ రంగం దాకా అన్నిచోట్ల ఏఐ టెక్నాలజీ తనదైన ముద్ర వేస్తోంది. ఓపెన్ ఏఐ కంపెనీకి చెందిన ప్రఖ్యాత ఏఐ ఛాట్ బోట్ ‘ఛాట్ జీపీటీ’ తమ వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దాని పేరు.. జీపీటీ- 4o. ఇదొక ఏఐ ఇమేజ్ క్రియేటర్. దీనితో మనం అనుకున్న విధంగా ‘ఛాట్ జీపీటీ’లో క్రియేటివ్ ఫొటోలను తయారు చేయించుకోవచ్చు.
Also Read :Bhatti Vikramarka : ‘‘ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడండి’’.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భట్టి హితవు
స్వయంగా శామ్ ఆల్ట్‌మన్..
జీపీటీ- 4o ఫీచర్ ఆవిష్కరణ గురించి స్వయంగా ఓపెన్ ఏఐ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ఇదొక సూపర్ ఫీచర్ అని ఆయన కొనియాడారు. ‘‘జీపీటీ- 4oతో రూపొందించిన ఫొటోలు ఏఐతో తయారైనవి అంటే నమ్మలేకపోతున్నా. ఆ ఫొటోలు అంతగా వాస్తవికతను సంతరించుకొని ఉన్నాయి’’ అని ఆల్ట్ మన్ చెప్పారు. ‘‘ఈ ఫీచర్‌తో యూజర్లు అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. అయితే అభ్యంతకరమైన అంశాలను సృష్టించొద్దు’’ అని ఆయన కోరారు.
Also Read :OYO Room : ఓయో రూమ్ కోసం ‘ఆధార్’ ఇస్తున్నారా ? ఇది తెలుసుకోండి
కచ్చితత్వంతో, సందర్భోచితంగా, అవగాహనతో..
‘‘జీపీటీ- 4o ఫీచర్ మునుపటి ఏఐ మోడల్(AI Image Creator) కంటే మెరుగ్గా పనిచేస్తుంది. కచ్చితత్వంతో, సందర్భోచితంగా, అవగాహనతో ఫొటోలను ఇది జనరేట్ చేయగలదు. నాన్- లాటిన్ లాంగ్వేజ్‌లో ప్రాంప్ట్ ఇస్తే ఒక్కోసారి రెండరింగ్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్నిసార్లు తప్పుగా క్రాప్ చేస్తుంది. అత్యంత సంక్లిష్టమైన ఫొటోల్లో మార్పులు చేసే సమయంలో ఒక్కోసారి సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఈ సవాళ్లను మేం పరిష్కరిస్తాం’’ అని ఓపెన్ ఏఐ కంపెనీ వెల్లడించింది. ‘‘త్వరలో చాట్‌జీపీటీ ప్లస్, ప్రో, టీమ్‌తో పాటు ఫ్రీ యూజర్లకు కూడా ఇమేజ్ జనరేషన్ ఫీచర్ అందుబాటులోకి తెస్తాం. డెవలపర్లు ఏపీఐ ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చు’’ అని తెలిపింది.