Top 5 Smart Watches : ఇటీవలి కాలంలో చాలామంది యువత స్మార్ట్‌వాచ్‌లను బాగానే వాడుతున్నారు. యువత ప్రధానంగా తమ బడ్జెట్ రేంజులో ఉండే బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల కోసం గూగుల్, యూట్యూబ్‌లలో తెగ సెర్చ్ చేస్తున్నారు. తమ అభిరుచికి తగ్గట్టుగా, సాధ్యమైనన్ని ఎక్కువ ఫీచర్లతో కూడిన స్మార్ట్ వాచ్‌ను ధరించి అందరి ముందు స్టైలిష్‌గా కనిపించాలని యూత్ భావిస్తున్నారు. అలాంటి వారి కోసం బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు ఇవిగో..
Also Read :UPI Fraud Gang Arrested : తెలంగాణలో యూపీఐ స్కాం.. బజాజ్ షోరూంలకు కుచ్చుటోపీ పెట్టిన ముఠా
- ఫాస్ట్ ట్రాక్ కంపెనీ స్మార్ట్ వాచ్‌ల తయారీలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ కంపెనీ నుంచి Fastrack Revoltt XR1 స్మార్ట్ వాచ్ విడుదలైంది. దీని ధర రూ.1,599. దీని డిస్‌ప్లే సైజు 1.38 అంగుళాలు. ఇందులోని బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే వారం రోజులు వస్తుంది. ఈ వాచ్‌లో స్లీప్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్ వంటి ఫీచర్లు(Top 5 Smart Watches) ఉన్నాయి.
- ఫాస్ట్ ట్రాక్ కంపెనీకి చెందిన మరో స్మార్ట్ వాచ్ మోడల్ పేరు.. Fastrack Revoltt FS1. దీని ధర రూ.1,599. డిస్‌ప్లే సైజు 1.83 అంగుళాలు. ఈ వాచ్ బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజులు వస్తుంది. ఇందులోనూ స్లీప్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్ ఫీచర్లు ఉన్నాయి.
- బీట్ ఎక్స్‌పీ వేగా నియో స్మార్ట్ వాచ్ కూడా చాలా బాగుంటుంది. దీని డిస్‌ప్లే కలర్ అమోల్డ్ కేటగిరీకి చెందింది. డిస్ ప్లే సైజు 1.43 అంగుళాలు. ఇందులోని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 7 రోజులు వస్తుంది. ఈ వాచ్ ధర కేవలం రూ.999. అయితేనేం ఇందులో పెడోమీటర్, స్లీప్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
- బోట్ కంపెనీకి చెందిన BoAt Watch Blaze స్మార్ట్‌వాచ్ కూడా బాగుంటుంది. దీని ధర రూ.999 మాత్రమే. ఈ వాచ్ డిస్ ప్లే సైజు 1.75 అంగుళాలు. ఇందులోని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే అత్యధికంగా 10 రోజుల పాటు వస్తుంది. ఇందులోనూ పెడోమీటర్, స్లీప్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.
- ఫైల్ బోల్ట్ కంపెనీ స్మార్ట్ వాచ్‌ల తయారీలో ఫేమస్. ఈ కంపెనీకి చెందిన ఫైర్ బోల్ట్ కమాండో స్మార్ట్ వాచ్ బాగుంటుంది. దీని ధర రూ.1,400. అందుకు తగ్గట్టుగానే డిస్‌ప్లే 1.96 అంగుళాలు ఉంటుంది. ఇందులోని బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 9 రోజులు వస్తుంది. మిగతా వాటిలాగే ఇందులోనూ పెడోమీటర్, స్లీప్ మానిటర్, క్యాలరీ కౌంట్, స్టెప్ కౌంట్ ఫీచర్లు ఉన్నాయి.