Budget Phone: అతి తక్కువ ధరకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. ధర, ఫీచర్స్ ఇవే?

సాధారణంగా మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతూ ఉంటాయి. అయితే వివిధ రకాల కంపెనీ స్మార్ట్ ఫోన్లు

  • Written By:
  • Publish Date - January 6, 2023 / 07:00 AM IST

సాధారణంగా మార్కెట్లోకి ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతూ ఉంటాయి. అయితే వివిధ రకాల కంపెనీ స్మార్ట్ ఫోన్లు ధర ఒకటే ఉన్నప్పటికీ కెమెరా అలాగే ఫీచర్స్ మాత్రం వేరువేరుగా ఉంటాయి. అయ్యా కంపెనీలు వినియోగదారులను ఆకర్షించడం కోసం అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ లను అతి తక్కువ ధరకే విడుదల చేస్తూ ఉంటాయి. తాజాగా మార్కెట్లోకి మూడు సరికొత్త స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. అయితే ధర విషయంలో అన్ని ఫోన్లు ఒకే రేంజ్ లో ఉన్న ఫీచర్స్ విషయంలో పలు మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ బడ్జెట్ ఫోన్ సెషన్ లో పోకో సీ 50, రెడ్ మీ ఏ1, రియల్ మీ సీ 30 ఫోన్లు విడుదల అయ్యాయి. మరి ఈ మూడు ఫోన్ల ధరలు వాటి ఫీచర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పోకో సీ 50 భారత్ లో రెండు స్టోరేజ్ వేరియంట్లల్లో అందుబాటులో ఉంది. అందులో 2 జీబీ,32 జీబీ వేరియంట్ ధర రూ.6499 కాగా, 3 జీబీ,32 జీబీ వేరియంట్ ధర రూ.7299 గా ఉంది. ఇకపోతే రెడ్ మీ ఏ1 విషయానికి వస్తే ఇది ఒకే మోడల్ వస్తుంది. 2 జీబీ,32 జీబీ వేరియంట్ ధర రూ.6499 గా ఉంది. అలాగే రియల్ మీ సీ 30ఎస్ రెండు స్టోరేజ్ వేరియంటలలో లభిస్తోంది. అందులో 2 జీబీ, 32 జీబీ వేరియంట్ ధర రూ.7499 కాగా , 4 జీబీ, 64 జీబీ మోడల్ ధర రూ. 8999 గా ఉంది. కాగా పోకో సీ 50 ప్లాస్టిక్ బాడీతో వెనకు ప్యానెల్ మాత్రం ఫాక్స్ లెదర్ ముగింపుతో వస్తుంది. రెడ్ మీ ఏ1 కూడా లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. రియల్ మీ సీ 30ఎస్ మాత్రం భిన్నంగా సూట్ కేస్ డిజైన్ తో వస్తుంది.

ఇకపోతే కెమెరా, బ్యాటరీ విషయానికి వస్తే.. పోకో సీ 50 ఫోన్ 8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 10 వాట్స్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనుంది. అలాగే రెడ్ మీ ఏ1 కూడా 8 ఎంపీ, 2ఎంపీ, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉండనుంది. అలాగే రియల్ మీ సీ 30 ఎస్ 8 ఎంపీ ప్రైమరీ కెమెరాతో, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రానుంది.