Site icon HashtagU Telugu

Boat Smart Ring: మార్కెట్లో బోట్ స్మార్ట్ రింగ్‌

Boat Smart Ring

New Web Story Copy (90)

Boat Smart Ring: స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ ఇయర్ బడ్స్.. ఇప్పుడు స్మార్ట్ రింగ్. గ్యాడ్జెట్లు అన్నీ స్మార్ట్ దనాన్ని సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు బోట్ స్మార్ట్ రింగ్ మార్కెట్లోకి రానుంది. ఈ నెల 28 నుంచి అమ్మకాలు మొదలవుతాయని బోట్ తాజాగా ప్రకటించింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బోట్ సంస్థ ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో బోట్ స్మార్ట్ రింగ్‌ను విడుదల చేసింది. సిరామిక్ డిజైన్‌తో వచ్చిన ఈ స్మార్ట్ రింగ్ మీ రోజువారీ కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తుంది. బోట్ స్మార్ట్ రింగ్ హెల్త్‌ ట్రాకర్‌గా పని చేస్తుంది. దీన్ని ధరించిన వారి హార్ట్ రేట్, రోజుకు ఎంత దూరం నడిచారు.. రక్తపోటు(BP)తో సహా ఇతర ఆరోగ్య సమాచారాన్ని అంతా ఎప్పటికప్పుడు అప్డేట్ తో అలర్ట్‌గా ఉంచుతుంది.

బోట్ స్మార్ట్ రింగ్ ధర రూ.8,999. ఆగస్టు 28 నుండి Amazon.in మరియు Flipkartలో అందుబాటులో ఉంటుంది.సిరామిక్ మరియు మెటల్ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్ రింగ్ స్వైప్ నావిగేషన్‌ను మరియు సాఫ్ట్ టచ్ నియంత్రణలతో పని చేస్తుంది. ఇందులో పాటలు వినేందుకు అవకాశముంది. ఇది బోట్ రింగ్ యాప్‌తో పని చేస్తుంది. యాప్ వినియోగదారుల ఆరోగ్యం గురించి సవివరమైన సమాచారాన్ని అందజేస్తుంది. 60 నిమిషాల పాటు ఛార్జింగ్ పెడితే వారం వరకు బ్యాటరీ సమర్థవంతంగా పని చేస్తుంది.

Also Read: బస్సు యాత్రకు సిద్దమవుతున్న వైసీపీ..