ఈరోజుల్లో మన జీవితం టెక్నాలజీ (Technology) చుట్టూ తిరుగుతోంది. నిద్రలేచినప్పటినుంచి పడుకునే వరకు స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌హోమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి మన జీవితాల్లో భాగమయ్యాయి. ఈ డివైజ్‌లు మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ, కొన్ని తీవ్రమైన సమస్యలను కూడా తీసుకువచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ ఆధారిత జీవనశైలి వలన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. అలాంటిది ఎన్నో సంవత్సరాల క్రితం బల్గేరియన్ జ్యోతిష్కురాలు బాబా వంగా (Baba Vanga) ఒక శక్తివంతమైన చిన్న డివైజ్ గురించి హెచ్చరించినట్టు ఇప్పుడు తెలిసి ప్రపంచమంతా ఆశ్చర్యపడుతోంది.
Lokesh : బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో మంత్రి లోకేశ్ భేటీ..నైపుణ్యాభివృద్ధిపై కీలక చర్చలు
బాబా వంగా చెప్పినట్లుగానే, స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు మన బిహేవియర్‌ను కంట్రోల్ చేసే స్థాయికి చేరింది. National Commission for Protection of Child Rights (NCPCR) ప్రకారం, 24% మంది పిల్లలు నిద్రకు ముందుగా ఫోన్ చూస్తున్నారు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతూ, డిప్రెషన్, ఏకాగ్రత లోపం, ఒంటరితనం వంటి సమస్యలకు దారితీస్తోంది. పెద్దలు కూడా రోజంతా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ కంటి ఒత్తిడి, మెడ నొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. బ్లూ లైట్ కారణంగా మెలటోనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది, ఇది నిద్రలో అంతరాయం కలిగిస్తుంది.
Mohammed Siraj : కొత్త బిజినెస్‌లొకి మహ్మద్ సిరాజ్
ఇంకా ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌లు మన నిజ జీవిత సంబంధాల మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ఒకే గదిలో ఉన్నా కుటుంబ సభ్యులు ఫోన్ చూస్తూ మాట్లాడుకోకుండా ఉంటున్నారు. ఇది ఎమోషనల్ డిస్‌కనెక్షన్‌కు దారితీస్తోంది. ఫ్యామిలీ బాండ్స్ బలహీనపడుతున్నాయి. బాబా వంగా ఈ ప్రమాదాన్ని అప్పటికే ఊహించడం గొప్ప విషయం. 1996లో మరణించినప్పటికీ, ఆమె జోస్యాలు ఇప్పటికీ చర్చకు వస్తుండటం, ప్రజల మైండ్‌ను ఆక్రమించే డివైజ్ గురించి ఆమె హెచ్చరిక ఎంత నిజమో మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం.