Apple-Air India Tie : యాపిల్, ఎయిర్ ఇండియా జట్టు.. ఏ విషయంలో కలిసి పనిచేస్తాయంటే ?

Apple-Air India Tie : ఓ వైపు యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ల ఉత్పత్తిని చేపట్టేందుకు రెడీ అవుతున్న టాటా గ్రూప్..  మరోవైపు తమ ఎయిర్ ఇండియాకు కూడా యాపిల్ నుంచి టెక్  సహకారాన్ని పొందాలని ప్లాన్ చేస్తోంది. 

  • Written By:
  • Updated On - July 22, 2023 / 12:22 PM IST

Apple-Air India Tie : ఓ వైపు యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ల ఉత్పత్తిని చేపట్టేందుకు రెడీ అవుతున్న టాటా గ్రూప్..  మరోవైపు తమ ఎయిర్ ఇండియాకు కూడా యాపిల్ నుంచి టెక్  సహకారాన్ని పొందాలని ప్లాన్ చేస్తోంది. 

యాపిల్ తో బంధాన్ని పెంచుకునే దిశగా టాటా గ్రూప్ అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది. 

ఇప్పటికే ఐఫోన్ల ఛాసిస్ ను చెన్నైలోని తమ ప్లాంట్ లో ఉత్పత్తి చేస్తున్న టాటా గ్రూప్.. త్వరలో మరిన్ని విభాగాల్లోనూ  యాపిల్ తో కలిసి నడవాలని యోచిస్తోంది. 

Also read : Godavari Floods: గోదావరి ఉగ్రరూపం, 100కు పైగా గ్రామాలు అతలాకుతలం!

ఈక్రమంలోనే  ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం పాలో ఆల్టోలో ఉన్న యాపిల్ ప్రధాన కార్యాలయాన్ని ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ సందర్శించారు. యాపిల్, ఎయిర్ ఇండియా పరస్పర సహకారంతో పనిచేసేందుకు అవకాశమున్న విభాగాలపై ఈ మీటింగ్ లో చర్చించారు. విమానంలోని ఇన్వెంటరీ, టికెట్ల ధరల ఆప్టిమైజేషన్, మెరుగైన విమాన ఇంజన్, విమాన ఉద్గారాల పనితీరు వంటి వాటిపై కూడా ఈసందర్భంగా డిస్కషన్ జరిగిందని క్యాంప్‌బెల్ విల్సన్ వెల్లడించారు. యాపిల్ కంపెనీకి ప్రీమియం వినియోగదారులు ఉంటారు. ఈ వినియోగదారుల్లో విమాన ప్రయాణ అవసరం పడే  వాళ్లు కూడా ఎంతోమంది ఉంటారు. యాపిల్ యూజర్స్ నుంచి విమాన ప్యాసింజర్లను జనరేట్ చేసుకునే అంశంపై కూడా చర్చ జరిగి ఉండొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. విమానంలో యూజర్స్ కు అత్యాధునిక స్థాయి టెక్ వసతుల కల్పన అనేది తప్పకుండా ఈ చర్చల్లో ప్రస్తావనకు వచ్చి  ఉండొచ్చని అంటున్నారు. ఎయిర్ ఇండియా పైలట్‌ల కోసం యాపిల్ యొక్క  ఫ్లైట్-ప్లానింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించనున్నట్లు మే నెలలో ఒక న్యూస్ రిపోర్ట్ పబ్లిష్ అయింది. ఇక యాపిల్ ఐప్యాడ్ లను ఎయిర్ ఇండియా(Apple-Air India Tie) ఇప్పటికే  పెద్దఎత్తున వినియోగిస్తోంది.

Also read : Kethika sharma : తన అందాలతో విదేశాల్లో రచ్చ చేస్తున్న కేతికా శర్మ

యాపిల్​ ఫోన్ల తయారీ ఫ్యాక్టరీ రూ. 4,900 కోట్లు 

తైవాన్ కంపెనీ  విస్ట్రన్ కు కర్ణాటకలోని బెంగళూరులో యాపిల్​ ఫోన్లను తయారు చేసే  ఫ్యాక్టరీ ఉంది. దీన్ని కొనేందుకు వచ్చే నెలలో విస్ట్రన్ కంపెనీతో  టాటా గ్రూప్ ఒప్పందం   కుదుర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐఫోన్ల అసెంబ్లింగ్​లోకి టాటాలు రావడం ఇదే మొదటిసారి. ఈ డీల్ విలువ దాదాపు రూ. 4,900 కోట్లు అని సమాచారం. గత 12 నెలలుగా ఫ్యాక్టరీ కొనుగోలుపై ఇరు వర్గాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీలో పది వేల మందికిపైగా  కార్మికులు పనిచేస్తున్నారు.  ఐఫోన్​ 14 మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  మన ఇండియాలో  ఇక్కడే తయారు చేస్తున్నారు.​