మీరు కొత్త ల్యాప్‌టాప్ లేదా వైర్‌లెస్ ఇయర్ బడ్స్‌ను కొనాలని చూస్తున్నారా..? అయితే మరో వారం రోజులు ఆగండి. ఎందుకంటే ప్రముఖ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ (Amazon Great Freedom Festival) ప్రారంభం కాబోతుంది. ల్యాప్ టాప్స్, ఇయర్ ఫోన్స్, స్మార్ట్‌వాచెస్‌తో పాటు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై 75 శాతం , యాపిల్ సహా ఇతర ప్రముఖ బ్రాండ్ల టాబ్లెట్లపై 50 శాతం వరకు డిస్కౌంట్ (Discount) ఇవ్వబోతుంది.
డిపెండెన్స్ డే (Independence Day) దగ్గర పడుతుండడం తో అమెజాన్.. ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ పేరిట ఆగస్టు 5 నుంచి ఆగస్టు 9 వరకు భారీ సేల్ నిర్వహించబోతుంది. ఈ సేల్ లో వివిధ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. అంతే కాదు SBI బ్యాంకు క్రెడిట్ కార్డులను ఉపయోగించే వ్యక్తులు 10 శాతం తగ్గింపు ఇస్తుంది. అలాగే అమెజాన్ ప్రైమ్ సభ్యులు అధికారిక ప్రారంభ తేదీకి ఒక రోజు ముందు ప్రారంభించి, విక్రయానికి ముందస్తు యాక్సెస్‌ను పొందే ఛాన్స్ ఇస్తుంది. ఈ సేల్ లో స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై గణనీయమైన తగ్గింపులను ఇవ్వనున్నట్ల అమెజాన్ ప్రకటించింది.
Samsung, OnePlus, Realme వంటి బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. ల్యాప్‌టాప్‌లు, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, టీజర్ పేజీ ల్యాప్‌టాప్‌లు, ఇయర్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, అనేక ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 75 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. Apple, ఇతర తయారీదారుల టాబ్లెట్‌లు గరిష్టంగా 50 శాతం తగ్గింపు ఇవ్వబోతుంది. ఈ ఫెస్టివల్ ద్వారా స్మార్ట్ టీవీలను కూడా తక్కువ ధరకే అందించబోతుంది. కొన్ని 4K టీవీలు 60 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు వంటి గృహోపకరణాలు కూడా ఆకర్షణీయమైన తగ్గింపు ధరలలో ఇవ్వనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఇప్పటి నుండే మీకు ఏమేమి కావాలో లిస్ట్ చేసుకొని రెడీ గా పెట్టుకోండి.
Read Also : Manipur : మహిళల నగ్న ఊరేగింపు వీడియో ఫై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు