Site icon HashtagU Telugu

Air Coolers : కార్లకు ఎయిర్ కూలర్లు.. ఏసీ ఎందుకు పనికిరాదంటున్న డ్రైవర్లు

Air Condition Cars

Air Condition Cars

అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌ (Afghanistan Kandahar) నగరంలో తీవ్రమైన ఎండలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదవుతుండటంతో, ట్యాక్సీ డ్రైవర్లు తమ కార్లపై సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. సాధారణంగా కార్లలో ఉండే ఎయిర్ కండిషన్ (Air Condition) వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడంతో, డ్రైవర్లు కార్లపై కూలర్లు అమర్చి వాటిని గొట్టాల ద్వారా కారు లోపలికి చల్లని గాలి పంపేలా తయారు చేసుకుంటున్నారు. ఈ విధానం ఏసీల కంటే మెరుగుగా పనిచేస్తోందని వారు చెబుతున్నారు.

Starlink : భారత్‌లో స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలు.. శాటిలైట్ ఇంటర్నెట్ రిలీజ్‌ షెడ్యూల్‌, ధరలు ఇవే!

ట్యాక్సీ డ్రైవర్లలో కొందరు టెక్నీషియన్ల సహాయంతో తమ అవసరాలకు తగ్గట్టుగా కూలర్లు తయారు చేయించుకుంటున్నారు. కాందహార్‌కు చెందిన గుల్ మొహమ్మద్ అనే డ్రైవర్, రూ. 3,700 ఖర్చు చేసి తన కారుకి ప్రత్యేక కూలర్ అమర్చించుకున్నట్లు తెలిపారు. ఈ కూలర్లతో కారు అంతా చల్లగా మారుతుందని, ప్రయాణికులకు సైతం సౌకర్యంగా ఉంటుందని అంటున్నారు. రోజు రెండు సార్లు వాటిలో నీళ్లు పోయాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఇది తక్కువ ఖర్చుతో ఎండ వేడిని తట్టుకునే చక్కని మార్గమని చెబుతున్నారు.

Election Commission : ఈసీ కీలక నిర్ణయం.. ఇక దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల సమగ్ర సవరణకు సన్నద్ధం!

అఫ్గానిస్తాన్‌ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తీవ్రమైన స్థాయిలో ఎదుర్కొంటోంది. 2024లో ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకూ అక్కడ రికార్డు స్థాయిలో ఎండలు నమోదయ్యాయి. ఈ ఉష్ణోగ్రతల తీవ్రతతో పాటు కరవు పరిస్థితులు గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధిని దెబ్బతీశాయని ఐక్యరాజ్య సమితి ఆహార, వ్యవసాయ సంస్థ తెలిపింది. తాలిబాన్ పాలన ప్రారంభమైన 2021 తర్వాత ఆ దేశాన్ని వాతావరణ చర్చల నుంచి తొలగించడంతో, అంతర్జాతీయ సహాయానికి మార్గం సైతం సంకుచితమైంది. దీనివల్ల అఫ్గానిస్తాన్ మానవీయ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.