Site icon HashtagU Telugu

AI Effect : కన్నీరు పెట్టిస్తున్న టెకీ ఆవేదన

A Techie's Tearful Anguish

A Techie's Tearful Anguish

ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ కాలంలో వేగంగా విస్తరించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఇప్పుడు లక్షలాది ఉద్యోగులను రోడ్డున పడేసింది. సాఫ్ట్‌వేర్‌, డేటా అనలిటిక్స్‌, కంటెంట్ రైటింగ్‌, కస్టమర్ సపోర్ట్, న్యూస్ యాంకర్లు ఇలా అనేక రంగాల్లో ఈ AI విస్తరించడం తో పెద్ద సంఖ్యలో టెకీలు ఉద్యోగాలు (software jobs) కోల్పోయి జీవనాధారాన్ని కోల్పోతున్నారు. ఈ సంక్షోభ సమయంలో ఓ ఐటీ ఉద్యోగి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హృదయాన్ని తాకేలా వైరల్ అవుతోంది.

Telangan BJP : టీబీజేపీ అధ్యక్షునిగా ఎల్లుండి రామచందర్‌రావు బాధ్యతలు

ఆ టెకీ తన ట్వీట్‌లో వ్యక్తపరిచిన ఆవేదన.. “టెకీలో పనిచేసే ఉద్యోగులు ఏటా లక్షలాది రూపాయల ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. కానీ మేము ఉద్యోగాలు కోల్పోయినప్పుడు, ప్రభుత్వం నుంచి ఏ విధమైన మద్దతు రావడం లేదు. కనీసం మేము చెల్లించిన పన్ను నుంచి కొంతమేరైనా తిరిగి మద్దతుగా ఇవ్వాలి. పన్ను చెల్లించేవాళ్లుగా మేము కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం గమనించాలి” అని కోరారు. ఈ ఆవేదన ఉద్యోగ భద్రతపై, ప్రభుత్వ స్పందనపై దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది.

KCR Hospitalised : అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్

ఈ నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు ప్రస్తావనలోకి వస్తున్నాయి. భారతదేశంలో పన్ను చెల్లింపుదారుల సంఖ్య తక్కువైనా, మిడిల్ క్లాస్ టెకీలు పెద్దమొత్తంలో ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. కానీ వారికే సంక్షోభ సమయంలో ప్రభుత్వ మద్దతు లేకపోవడం బాధాకరం. చాలా దేశాల్లో ఉద్యోగ భృతి (Unemployment Benefits) వంటి పథకాలు ఉండగా, భారతదేశంలో అలాంటి భరోసా తక్కువగా ఉన్నాయి. AI వలన ఉద్యోగాలు కనుమరుగై పోతున్న ఈ ట్రాన్సిషన్ పీరియడ్‌లో పన్ను చెల్లింపుదారుల కష్టాలను గుర్తించి, ప్రభుత్వం వారికి కనీస సెక్యూరిటీ గ్యారంటీలు కల్పించే విధంగా విధానాలు తీసుకురావాల్సిన అవసరం అత్యంత కీలకం. ఈ ట్వీట్ వలన వచ్చిన స్పందనలు ఒక వైపు భావోద్వేగం, మరోవైపు దేశంలో పాలనా బాధ్యతలపై సమీక్షకు దారితీస్తున్నాయి.