Jio Fiber Plan : జియో నుంచి 30 రోజుల ఉచిత సర్వీస్‌

జియో ఫైబర్‌ (Jio Fiber) పేరుతో బ్రాడ్‌బ్యాండ్‌ (Broadband) రంగంలో కూడా అడుగుపెట్టిన ఈ సంస్థ, మెరుగైన సేవలను అందిస్తూ తనదైన ముద్ర వేసింది.

30 Days Free Jio Fiber Plan : అంబానీ స్థాపించిన జియో, టెలికాం రంగంలో తనసత్తా చాటుతుంది. జియో ఫైబర్‌ (Jio Fiber) పేరుతో బ్రాడ్‌బ్యాండ్‌ (Broadband) రంగంలో కూడా అడుగుపెట్టిన ఈ సంస్థ, మెరుగైన సేవలను అందిస్తూ తనదైన ముద్ర వేసింది. తక్కువ సమయంలోనే దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించి.. అతి పెద్ద ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా అవతరించి.. చౌక ధరలో సేవల్ని విస్తరించింది. చౌక ధరలో ఎన్నో బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు తీసుకొచ్చిన జియో.. ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయకుండానే మరో 30 రోజుల పాటు జియోఫైబర్‌ సర్వీసులను పొడిగించేందుకు సిద్ధమైంది.

జియో ఫైబర్‌ (Jio Fiber) అందించే ఈ 30 రోజుల ఉచిత సర్వీస్‌ను పొందాలనుకుంటే.. బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లలో లాంగ్‌టర్మ్‌ ప్లాన్లను ఎంచుకోవాలి. వార్షిక ప్లాన్‌ రీఛార్జ్‌ తో అదనపు 30 రోజుల ఉచిత సర్వీస్‌ పొందవచ్చు. అంటే 12 నెలల రీఛార్జ్‌తో 13 నెలల వరకు సర్వీస్‌ సేవలు పొందవచ్చన్నమాట! అయితే 6 నెలల రీఛార్జ్‌తో అదనంగా 15 రోజుల వరకు ఉచిత సర్వీస్‌ లభిస్తుంది. అయితే నెలవారీ ప్లాన్లు, త్రైమాసిక ప్లాన్లకు ఈ ఆఫర్‌ వర్తించదు. మరోవైపు నెలకు రూ.999 రీఛార్జ్‌తో ఓటీటీ ప్లాన్‌లను జియోఫైబర్‌ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌తో యూజర్లు వివిధ రకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు ఉచితంగా సెటప్‌ బాక్స్‌ను పొందొచ్చు.

Also Read:  Xiaomi Mini Electric Car : రూ. 3.47 లక్షలకే షావొమి మినీ ఎలక్ట్రిక్ కారు