16 Psyche Asteroid : సంపద.. ఎవరికి మాత్రం చేదు !! సంపన్నుడిగా మారాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే భూమి మీద దొరికే సంపదతో ప్రతి ఒక్కరు ముకేశ్ అంబానీలా సంపన్నులుగా మారే అవకాశమైతే లేదు. కానీ ఒక ఆస్టరాయిడ్ (గ్రహ శకలం) కటాక్షం లభిస్తే మాత్రం.. భూమిపై ప్రతి ఒక్కరు ముకేశ్ అంబానీలా రిచ్ అయిపోతారట. ఇంతకీ ఆ ఆస్టరాయిడ్ ఏది ? దానిపై అంత సంపద ఎక్కడిది ? ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :KTR Vs ED : వచ్చే వారం కీలకం.. కేటీఆర్ విషయంలో ఈడీ, ఏసీబీ ఏం చేయబోతున్నాయి ?
- ‘16 సైకీ’ గ్రహశకలం(16 Psyche Asteroid) ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దానిపై బంగారం, ప్లాటినం, నికెల్, ఇనుము వంటి విలువైన ఖనిజ వనరులు పెద్ద మోతాదులో ఉన్నాయట. వాటి విలువ దాదాపు 10వేల క్వాడ్రిలియన్ డాలర్లు ఉంటుందట.
- 10వేల క్వాడ్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 100 మిలియన్ బిలియన్ డాలర్లకు సమానం. ఇంత భారీ విలువను మన భారతీయ కరెన్సీలో లెక్కించడం దాదాపు అసాధ్యం.
- సాధారణంగా 100 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8 లక్షల కోట్లు. అలాంటి 100 మిలియన్ల బిలియన్ డాలర్లు అంటే ఎంత అవుతుందో మనం అంచనా వేసుకోవచ్చు. ముకేశ్ అంబానీ నికర సంపద విలువ రూ.10 లక్షల కోట్ల లోపే ఉంది. అంటే లెక్కలేనంత సంపదను క్రియేట్ చేసే సత్తా ‘16 సైకీ’ గ్రహశకలంపై ఉన్న ఖనిజ వనరులకు ఉంది.
- 16సైకీపై ఉన్న ఖనిజ వనరుల విలువ యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విలువ కంటే ఎక్కువట.
- ఈ గ్రహశకలం చుట్టుకొలత 226 కిలోమీటర్లు. ఇది సూర్యుడి చుట్టూ ఒక కక్ష్యను పూర్తి చేయడానికి దాదాపు ఐదేళ్లు పడుతుండట.
- 16సైకీ భూమి కంటే సూర్యుడి నుంచి దాదాపు మూడు రెట్ల దూరంలో ఉందట
- . అంగారక గ్రహం, బృహస్పతి గ్రహం కక్ష్యల మధ్య ‘16 సైకీ’ తిరుగుతుంటుంది.
- దీన్ని 1852లో ఇటాలియన్ శాస్త్రవేత్త అన్నీబేల్ డి గ్యాస్పరిస్ కనుగొన్నారు.
Also Read :Sritej Health Condition: శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు.. కిమ్స్ అలా.. మంత్రి ఇలా!
రంగంలోకి నాసా అంతరిక్ష నౌక
16సైకీ గ్రహశకలం మన భూమికి దాదాపు 3.5 బిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకవేళ అది భూమిని ఢీకొంటే భారీ విపత్తు సంభవించే ముప్పు ఉంటుంది. దీనిపై పరిశోధనల కోసం 2023లో నాసా ఒక మిషన్‌ను ప్రారంభించింది. నాసా తన సైక్ అంతరిక్ష నౌకను 2023 అక్టోబరులో పంపింది. ఆ అంతరిక్ష నౌక 2029 ఆగస్టు నాటికి 16సైకీ సమీపంలోకి చేరుకోనుందని అంచనా. ఈ అంతరిక్ష నౌక 16సైకీని మ్యాప్‌లు చేసి అధ్యయనం చేస్తుంది. దాని ఉపరితలంపై ఉన్న ఖనిజ వనరుల వివరాలను గుర్తిస్తుంది. 16సైకీ చుట్టూ ఒకసారి తిరిగి దాని పూర్తి మ్యాపింగ్ చేయడానికి అంతరిక్ష నౌకకు రెండేళ్ల టైం పడుతుంది.