PCB New Chairman: పాక్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్‌గా జాకా అష్రఫ్

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) కొత్త ఛైర్మన్‌గా జాకా అష్రఫ్ ఎన్నికయ్యారు. పీసీబీ ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో నాలుగు నెలల పాటు కొత్త పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీకి పాకిస్థాన్ ప్రధాని ఆమోదం తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
PCB New Chairman

New Web Story Copy 2023 07 06t182822.572

PCB New Chairman: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) కొత్త ఛైర్మన్‌గా జాకా అష్రఫ్ ఎన్నికయ్యారు. పీసీబీ ఎన్నికల ప్రక్రియలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో నాలుగు నెలల పాటు కొత్త పీసీబీ మేనేజ్‌మెంట్ కమిటీకి పాకిస్థాన్ ప్రధాని ఆమోదం తెలిపారు. ఈ కమిటీలో పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మెన్ జహీర్ అబ్బాస్‌కు కూడా చోటు దక్కింది.

పీసీబీ ఎన్నికలు జూన్ 27న జరగాల్సి ఉండగా, పాలకమండలి రాజ్యాంగాన్ని సవాలు చేస్తూ మాజీ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు వివిధ హైకోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో వాయిదా పడింది. కాగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కొత్త ఛైర్మన్ ఎన్నికపై బలూచిస్థాన్ హైకోర్టు జూలై 17 వరకు స్టే విధించింది.

Read More: Rajasthan Elections: దూకుడు పెంచిన కాంగ్రెస్

  Last Updated: 06 Jul 2023, 06:28 PM IST