Chahal- Dhanashree Divorce : భారత క్రికెట్ జట్టు స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ గురువారం (ఏప్రిల్ 20) అధికారికంగా విడాకులు (Chahal- Dhanashree Divorce) తీసుకున్నారు. ఇద్దరూ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో మేజిస్ట్రేట్ ముందు హాజరుకాగా, విడాకులు మంజూరు చేశారు. యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీకి 4.75 కోట్ల రూపాయల భరణం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
నాలుగేళ్ల వివాహమైన తర్వాత క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ గురువారం విడాకులు తీసుకున్నారు. ముంబైలోని ఫ్యామిలీ కోర్టు గురువారం దీనికి ఆమోదం తెలిపింది. ఇద్దరూ రెండున్నరేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారు. వారు 11 డిసెంబర్ 2020న వివాహం చేసుకున్నారు. చాహల్ తరపు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ఇరు పక్షాల ఉమ్మడి పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు స్వీకరించింది. ఇప్పుడు ఇద్దరూ భార్యాభర్తలు కాదని స్పష్టం చేశారు.
Read Also: Marri Rajasekhar : త్వరలో టీడీపీలో చేరుతా : మర్రి రాజశేఖర్
తీర్పు వెలువడే సమయంలో చాహల్, ధనశ్రీలు కోర్టులో ఉన్నారు. ఒకరోజు ముందు బాంబే హైకోర్టు చాహల్ పిటిషన్‌పై మార్చి 20న తన తీర్పును ప్రకటించాలని కుటుంబ న్యాయస్థానాన్ని ఆదేశించింది. జస్టిస్ మాధవ్ జామ్‌దార్‌తో కూడిన సింగిల్ బెంచ్ ‘చాహల్ ఐపిఎల్‌లో పాల్గొనవలసి ఉన్నందున మార్చి 21 నుండి అందుబాటులో ఉండడు’ అని పేర్కొంది. ఇద్దరి మధ్య రూ.4.75 కోట్లకు సెటిల్ మెంట్ కుదిరిందని చాహల్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ధనశ్రీకి చాహల్ ఇప్పటికే రూ.2.37 కోట్లు ఇచ్చాడు.
చాహల్, ధనశ్రీలు మాస్క్‌లు ధరించి సుమారు గంటపాటు కోర్టులోనే ఉండిపోయారు. ఇద్దరూ ముఖానికి మాస్క్‌లు ధరించారు. ధనశ్రీ బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్ ధరించి వైట్ టాప్, బ్లూ జీన్స్ వేసుకుంది. వారిద్దరూ మీడియాతో మాట్లాడలేదు. ఎలాంటి వాంగ్మూలం ఇవ్వకుండానే ఇద్దరూ కోర్టు గదిలోకి వెళ్లారు. చాహల్ టీషర్ట్‌పై ‘బి యువర్ ఓన్ షుగర్ డాడీ’ అని రాసి ఉంది. అంటే ‘ఆర్థిక సహాయం కోసం వేరొకరిపై ఆధారపడకూడదనే అర్థం. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పెళ్లయిన ఏడాదిన్నర తర్వాత మనస్పర్థలు
ఝలక్ దిఖ్లా జా-11 ఎపిసోడ్ సందర్భంగా యుజ్వేంద్ర చాహల్‌తో తన ప్రేమ కథ గురించి ధనశ్రీ వర్మ వెల్లడించారు. మే-జూన్ 2020 లాక్‌డౌన్ సమయంలో డ్యాన్స్ నేర్చుకోవడానికి చాహల్ తనను సంప్రదించాడని, ఆ సమయంలోనే ప్రేమలో పడినట్లు తెలిపింది. తర్వాత వారిద్దరూ 2020 డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్నారు. జూన్ 2022 నుండి ఇద్దరి మధ్య సంబంధాలు క్షీణించాయి. విడాకుల వార్త మొదట సోషల్ మీడియాలో వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ధనశ్రీతో ఉన్న అన్ని చిత్రాలను చాహల్ తొలగించాడు. వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.
దాదాపు రెండేళ్ల తర్వాత ఫిబ్రవరి 2025లో ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు దాఖలు చేశారు. ఫ్యామిలీ కోర్టు ఆరు నెలల కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇచ్చింది. దీనిపై చాహల్ హైకోర్టులో అప్పీలు చేశారు. మార్చి 19న హైకోర్టులో విచారణ జరిగింది. చాహల్ పిటిషన్‌పై మార్చి 20న తీర్పు వెలువరించాలని బాంబే హైకోర్టు బుధవారం ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉన్నందున మార్చి 21 నుంచి చాహల్ అందుబాటులో ఉండడని జస్టిస్ మాధవ్ జామ్‌దార్‌తో కూడిన సింగిల్ బెంచ్ తెలిపింది. తాజాగా ఈరోజు చాహల్- ధనశ్రీకి విడాకులు మంజూరు చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది.