Yuvraj Singh: టీమిండియాకు ఎన్నో గొప్ప గొప్ప విజయాలు అందించిన యువరాజ్ సింగ్ తాజాగా తన సారధ్యంలో మరో టైటిల్ గెలుచుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్ మ్యాచ్ శనివారం జరిగింది, ఇందులో భారత్ ఛాంపియన్స్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్ ఛాంపియన్‌లను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఐదు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. భారత్ చాంపియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో భారత్ చాంపియన్స్, వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టైటిల్ ను గెలుచుకుంది.
ఈ టైటిల్ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్ తన ఆల్ టైమ్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌ని ప్రకటించాడు. షాకింగ్ ఏంటంటే టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి యువరాజ్ సెలెక్ట్ చేసిన జట్టులో చోటు దక్కలేదు. పైగా ఈ జట్టులో ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే యువరాజ్ చోటు కల్పించాడు. అలాగే ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. 12వ ఆటగాడిగా తనను ఎంపిక చేసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్‌లను ఓపెనర్లుగా ఎంపిక చేశాడు. 3వ స్థానంలో రోహిత్ శర్మకు, 4వ స్థానంలో విరాట్ కోహ్లీకి యువరాజ్ చోటు కల్పించారు.
యువరాజ్ తన ఆల్-టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఎబి డివిలియర్స్‌తో పాటు మాజీ ఇంగ్లాండ్ ఆల్-రౌండర్ ఆండ్రూ ఫ్లింటాఫ్‌ను కూడా చేర్చుకున్నాడు.ఇంకా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను వికెట్ కీపర్‌గా ఎంచుకున్నాడు.బౌలర్లలో ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్ మరియు వసీం అక్రమ్ లకు చోటు దక్కింది. ఇదిలా ఉంటె ఆల్ టైం బెస్ట్ టీం లో తన అజాత శత్రువైన ఫ్లింటాఫ్ కు అవకాశం కల్పించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2007 టీ20 ప్రపంచకప్‌లో యువరాజ్ సింగ్ సృష్టించిన పరుగుల విధ్వంసం గురించి తెలియని క్రికెట్ అభిమాని ఉండడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 బంతుల్లోని 6 సిక్సర్ల ప్రపంచరికార్డు భారత క్రికెట్ చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టంగా నిలిచిపోయింది. ఇంగ్లండ్ పేసర్ స్టువర్డ్ బౌలింగ్ లో యూవీ బాదిన ఆ బాదుడు..అతనికి సిక్సర్ల సింగ్ అనే బిరుదునిచ్చింది. ఆ మ్యాచ్‌లో అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ రెచ్చగొట్టడంతోనే యూవీ ఈ అరుదైన ఫీట్ సాధించాడు. ఫ్లింటాఫ్ రెచ్చగొట్టడంతోనే తాను హిట్టింగ్‌కు దిగానని యువీ చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.
Also Read: Champions Trophy 2025: మీరు మా దేశం వస్తేనే మేము ప్రపంచకప్ ఆడతాం: పాక్