Yo-Yo Score: భారత జట్టు యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఫిట్‌నెస్ గురించి పెద్ద అప్‌డేట్ వస్తోంది. నితీష్ IPL 2025కి ముందు తన జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు. జట్టులోకి రాకముందే నితీష్ యో-యో స్కోర్ వెల్లడి కావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ యువ ఆల్ రౌండర్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో జరిగిన యో-యో టెస్ట్‌లో (Yo-Yo Score) 18.1 స్కోర్‌తో ఉత్తీర్ణుడయ్యాడు. ఇది భారత జట్టు వెటరన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ.
ఈ విషయాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా జర్నలిస్టు గౌరవ్ గుప్తా తెలిపారు. నితీష్ ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడని, హైదరాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటాడని చెప్పాడు. 2016లో టైటిల్ గెలిచిన హైదరాబాద్ ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడాల్సి ఉంది.
Also Read: WPL 2025 Final: మరికొద్దీ గంటల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్.. కప్ ఎవరిదో?
విరాట్ 2023లో తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో యో-యో స్కోర్‌ను షేర్ చేసుకున్నాడని అందరికీ తెలిసిందే. అప్పుడు విరాట్ స్కోరు 17.2. అయితే యో-యో స్కోర్‌ను విరాట్ పంచుకోవడం బీసీసీఐకి నచ్చలేదు. ఆ తర్వాత ఆటగాళ్లందరినీ హెచ్చరించింది. యో-యో స్కోర్‌ని ఎవరితోనూ పంచుకోవద్దని చెప్పింది.
నితీష్ రెడ్డికి ఎప్పుడు గాయమైంది?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 ముగిసిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి గాయపడ్డారని వార్తలు వచ్చాయి. గాయం కారణంగా ఈ ఆల్ రౌండర్ ఇంగ్లండ్‌తో జరిగిన T-20 సిరీస్‌కు దూరంగా ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత అతన్ని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు పంపారు. ఐపీఎల్‌కు ముందు అతని ఫిట్‌నెస్‌పై ఎన్నో ఊహాగానాలు వచ్చినా ఇప్పుడు మళ్లీ ఫిట్‌నెస్ సాధించడం ద్వారా అన్ని ఊహాగానాలకు తెరపడింది. అయితే ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభకానున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని జట్ల ఆటగాళ్లు ఇప్పటికే తమ జట్టు శిబిరాలకు చేరుకుంటున్నారు. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ జట్ల మధ్య జరగనుంది.