Yashasvi Jaiswal: వాంఖడే మైదానంలో యశస్వి జైస్వాల్ చెలరేగిపోయాడు. ముంబయి ఇండియన్స్ బౌలర్లని వారి సొంతగడ్డపైనే ఉతికారేశాడు. కేవలం 62 బంతుల్లోనే 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 123 భారీ స్కోర్ చేసి సత్తా చాటాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 212 భారీ స్కోర్ చేసింది. కాగా నిన్న జరిగిన మ్యాచ్ లో జైశ్వాల్ అవుట్ పై అంపైర్ పై ట్రోల్స్ చేస్తున్నారు.
ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆదివారం ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ విధ్వసంకర శతకం బాదాడు. అయితే, యశస్వి వికెట్‌పై అభిమానులు అంపైర్‌పై విరుచుకుపడటంతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. రాజస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో బౌలర్ అర్షద్ ఖాన్ ఓవర్ నాలుగో బంతిని ఫుల్ టాస్ గా వేశాడు, దాంతో షాట్ ఆడేందుకు యశస్వి గాలిలో బంతిని మైదానం దాటించే ప్రయత్నం చేయగా ఫాలో త్రోలో అర్షద్ క్యాచ్ అందుకున్నాడు. అయితే బంతి నడుము పైన కనిపించడంతో ఆన్ ఫీల్డర్ అంపైర్ థర్డ్ అంపైర్ సహాయం తీసుకున్నాడు. థర్డ్ అంపైర్ అందరికీ షాక్ ఇచ్చాడు, బంతిని రైట్ బాల్ గా ప్రకటించాడు. కానీ రీప్లేలో బంతి నడుముపైకి కొద్దిగా వెళుతున్నట్లు కనిపించింది. అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు మింగుడు పడకపోవడంతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అంపైర్ ముంబై ఇండియన్స్ మనిషి అంటూ.. మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
నిన్నటి మ్యాచ్ లో యశస్వి జైస్వాల్ మొదటి నుండి అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు 32 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. యాభై పూర్తి చేసిన తర్వాత యశస్వి దూకుడు పెంచాడు. 360 డిగ్రీస్ లో షాట్లు ఆడాడు. 53 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు. రిలే మెరిడెత్ ఓవర్‌లో యశస్వి హ్యాట్రిక్ ఫోర్లు కొట్టగా, జోఫ్రా ఆర్చర్ ఓవర్లో కూడా యశస్వి లాంగ్ సిక్స్‌లు బాదాడు.
ముంబై జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జోప్రా ఆర్చర్, పీయూస్ చావ్లా, కుమార్ కార్తికేయ, రిలే మెరాడిత్, అర్షద్ ఖాన్
రాజస్థాన్ జట్టు : జోస్ బట్లర్, యశస్వి జైశ్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్/కీపర్), దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, సిమ్రాన్ హెట్‌మెయర్, రవిచంద్రన్ అశ్విన్, జేసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేందర్ చాహల్.
Read More: TDP : రజనీకాంత్ పై వైసీపీ విమర్శలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలి – టీడీపీ అధినేత చంద్రబాబు