Site icon HashtagU Telugu

Yashasvi Jaiswal: టెస్ట్ క్రికెట్‌లో ప్ర‌పంచ రికార్డు సృష్టించ‌నున్న జైస్వాల్!

ICC Test Rankings

ICC Test Rankings

Yashasvi Jaiswal: జులై 2 నుండి బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ క్రికెట్ స్టేడియంలో భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు సిరీస్‌లో 0-1 తేడాతో వెనుకబడి ఉంది. మొద‌టి టెస్ట్‌లో తప్పిదాలను మరచి, రెండవ టెస్ట్‌లో జట్టు పునరాగమనం చేయాలని భావిస్తోంది. మొదటి టెస్ట్‌లో శతకం సాధించిన యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) ప్రపంచ రికార్డును సృష్టించే అవకాశం ఉంది.

యశస్వీ జైస్వాల్ లీడ్స్ టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 101 పరుగులు చేశాడు. అయితే రెండవ ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే ఔట్ అయ్యాడు. కానీ అతను మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. అతను షాహిద్ అఫ్రిదీ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేందుకు ద‌గ్గ‌రలోనే ఉన్నాడు.

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు సాధించిన బ్యాట్స్‌మన్

ప్రస్తుతం ఈ రికార్డు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ పేరిట ఉంది. అతను 46 ఇన్నింగ్స్‌లలో టెస్ట్ క్రికెట్‌లో 50 సిక్సర్లు పూర్తి చేశాడు. యశస్వీ జైస్వాల్ విషయానికొస్తే.. 8 ఇన్నింగ్స్‌లలో 40 సిక్సర్లు సాధించాడు. అతను 10 సిక్సర్లు కొట్టడం ద్వారా అఫ్రిదీ ప్రపంచ రికార్డును తన పేరిట చేర్చుకోవచ్చు. జైస్వాల్ టెస్ట్ రికార్డు ఇంగ్లాండ్‌తో మంచిగా ఉంది. ఇప్పటివరకు 11 ఇన్నింగ్స్‌లలో 27 సిక్సర్లు కొట్టాడు. ఈ ఒక్క జట్టుపైనే అత్యధిక సిక్సర్లు సాధించాడు. ఒకవేళ రెండవ టెస్ట్‌లో 10 సిక్సర్లు కొట్టలేకపోయినా.. ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం భవిష్యత్తులో ఉంటుంది. అఫ్రిదీ రికార్డును బద్దలు కొట్టడానికి జైస్వాల్ తదుపరి 7 ఇన్నింగ్స్‌లలో 10 సిక్సర్లు కొట్టాలి.

Also Read: YSRCP: వైపీసీ మాజీ మంత్రికి షాకుల మీద షాకులు.. మళ్లీ కస్టడీకి

రోహిత్ శర్మను వెనక్కి నెట్టడం ఖాయం

టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 50 సిక్సర్లు సాధించిన రెండవ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్‌ ఇటీవల టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 51 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును తాకాడు. జైస్వాల్ రోహిత్‌ను వెనక్కి నెట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. జైస్వాల్ ఇప్పటివరకు 20 టెస్ట్ మ్యాచ్‌లలో 38 ఇన్నింగ్స్‌లలో 1903 పరుగులు చేశాడు. అతను 2000 టెస్ట్ పరుగులను పూర్తి చేయడానికి కూడా ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు. టెస్ట్‌లో అతను ఇప్పటివరకు 5 శతకాలు, 10 అర్ధశతకాలు సాధించాడు.

ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్ ఇండియా ఎప్పుడూ గెలవలేదు!

భారత్ ఇంతకు ముందు ఈ గ్రౌండ్‌లో 8 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 7 ఇంగ్లాండ్ గెలిచింది. 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఒకవేళ శుభ్‌మన్ గిల్ బృందం ఈ టెస్ట్‌ను గెలిచినట్లయితే ఈ గ్రౌండ్‌లో భారత్ మొదటి విజయం అవుతుంది.