Site icon HashtagU Telugu

WTC 2025 Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్‌-పాక్‌ తలపడటం కష్టమేనా?

WTC 2025 Final

WTC 2025 Final

WTC 2025 Final: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పాకిస్తాన్ 2-0 తేడాతో ఓడిపోయింది. రెండో టెస్టులో పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి బంగ్లాదేశ్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమి తర్వాత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో పాక్ పాయింట్ల పట్టికలో చాలా నష్టపోయింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ కు చేరడం దాదాపు కష్టతరంగా మారింది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్,పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగే అవకాశముంది. అదెలాగో చూద్దాం.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమిండియా నంబర్ 1 స్థానంలో ఉండగా, బంగ్లాదేశ్‌పై ఓటమిని చవిచూసిన పాకిస్థాన్ జట్టు 8వ స్థానంలో ఉంది. దీంతో పాకిస్థాన్ కు కష్టాలు పెరిగాయి. అటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకునే జట్లలో టీమ్ ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ముందు వరుసలో ఉన్నాయి .ఇప్పటి వరకు 9 మ్యాచ్‌ల్లో భారత్ 6 గెలిచింది, 2 మ్యాచ్‌లు ఓడిపోగా, పాకిస్థాన్ జట్టు 7 మ్యాచ్‌ల్లో 2 మాత్రమే గెలిచింది. అయితే 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ​​సైకిల్‌లో పాకిస్థాన్ ఇంకా 7 టెస్టులు ఆడాల్సి ఉంది. ఫైనల్‌కు చేరుకోవడానికి, పాకిస్తాన్ ఆడే అన్ని టెస్ట్ మ్యాచ్‌లు గెలవాల్సి ఉంది. అయినప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకోవడం అసాధ్యమనే చెప్పాలి.

ఆ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశం ఇతర జట్టు ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఇది కూడా ప్రశ్నార్ధకమే. భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య చివరి టెస్టు మ్యాచ్‌ 2007లో ఆడింది అది కాస్త డ్రాగా ముగిసింది. ఇప్పుడు 18 ఏళ్ల తర్వాత భారత్, పాకిస్థాన్‌లు టెస్టుల్లో తలపడనున్నాయి. టీమిండియా ఒక్కసారి టైటిల్ గెలవలేకపోయినా, రెండుసార్లు ఫైనల్స్‌కు చేరుకుంది. పాక్ మొదటి సీజన్ నుంచి నిరంతరం విఫలమవుతూ ఉంది. ఏదేమైనప్పటికీ పాకిస్థాన్ ఫైనల్ చేరాలంటే దాదాపు అసాధ్యాన్ని సుసాధ్యం చేయాల్సి ఉంటుంది.

Also Read: Yoga : రోజూ 40 నిమిషాలు యోగా.. మధుమేహం ముప్పు తగ్గుతుందని అధ్యయనంలో వెల్లడి..!

Exit mobile version