Site icon HashtagU Telugu

Angelo Mathews: ఏంజెలో మాథ్యూస్… ఏంటీ దురదృష్టం

Angelo Mathews

Angelo Mathews

Angelo Mathews: గతేడాది చివర్లో జరిగిన ప్రపంచకప్ లో శ్రీలంక స్టార్ క్రికెటర్ ఏంజెలో మాథ్యూస్ టైంఅవుట్ ద్వారా అవుట్ అయిన తొలి క్రికెటర్ గా క్రికెట్ చరిత్రలో నిలిచాడు. ఈ ఏడాది ప్రారంభంలో భారీ ఇన్నింగ్స్ ఆడి అత్యంత చెత్తగా అవుట్ అయ్యాడు. ఈ రకమైన అవుట్ ప్రపంచంలో చెత్త అవుట్ గా పరిగణిస్తున్నారు విశ్లేషకులు.

అఫ్గానిస్థాన్‌తో కొలంబో వేదికగా జరుగుతున్న టెస్ట్‌లో మాథ్యూస్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్ లో సూపర్ సెంచరీతో చెలరేగిన మాథ్యూస్ 141 పరుగులతో ఆఫ్ఘన్ బౌలర్లను ఊచకోత కోశాడు. శ్రీలంక స్కోరు 5 వికెట్లకు 410 పరుగుల సమయంలో ఏంజెలో మాథ్యూస్ 141 వద్ద దురదృష్టకర రీతిలో అవుట్ అయ్యాడు. ఆఫ్ఘన్ బౌలర్ క్యాష్ మహ్మద్ బౌలింగ్ లో మాథ్యూస్ భారీ షాట్ ఆడటంతో బంతి బౌండరీ లైన్ ను తాకింది. అయితే భారీ షాట్ కొట్టిన మాథ్యూస్ నియంత్రణ కోల్పోయాడు. ఇంకేముందు బ్యాట్ నేరుగా వికెట్లను గిరాటేసింది. దీంతో ఏంజెలో మాథ్యూస్ హిట్ వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు.

మాథ్యూస్ కొట్టిన ఆ బౌండరీని పరిగణలోకి తీసుకోలేదు. ఆ 4 పరుగులు అతని స్కోరుకు లేదా జట్టు స్కోరు బోర్డుకు జోడించలేదు. ఈ ఇన్నింగ్స్ లో మాథ్యూస్ 259 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 141 పరుగులు చేశాడు. డబుల్ సెంచరీకి చేరువైన క్రమంలో దురదుష్టం వెంటాడింది. ఇలా విచిత్రంగా అవుట్ కావడంతో దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. 141 పరుగులు చేసినందుకు మెచ్చుకోవాలో, ఇలా చెత్తగా అవుట్ అయినందుకు విమర్శించాలో తెలియడంలేదంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. కాగా ఈ మ్యాచ్ లో శ్రీలంక 10 వికెట్ల తేడాతో ఆఫ్గాన్ ను చిత్తు చేసింది. ఆఫ్గాన్ తొలి ఇన్నింగ్స్ లో 198, రెండో ఇన్నింగ్స్ లో 296 పరుగులు చేయగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 439 పరుగులు చేసింది, రెండో ఇన్నింగ్స్ లో 56 పరుగులు చేసి విజయం సాధించింది.

Also Read: Spearmint: ప్రతిరోజు ఉదయాన్నే పుదీనా తినడం వల్ల కలిగే లాభాలు ఇవే?