Site icon HashtagU Telugu

World Test Championship: శ్రీలంక‌ను ఓడించిన ఇంగ్లండ్‌.. WTC పాయింట్ల ప‌ట్టిక‌లో భారీ మార్పు..!

WTC Final

WTC Final

World Test Championship: తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (World Test Championship)లో ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో కూడా భారీ దూసుకెళ్లింది. ఈ జంప్‌తో ఇంగ్లండ్‌ ఫైనల్‌కు చేరాలనే ఆశలు మరింత పెరిగాయి. ఇప్పటి వరకు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లండ్ ఒక్కసారి కూడా ఫైనల్ చేరలేకపోయింది. అయితే ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో భారీ జంప్ చేయ‌డంతో అగ్రస్థానంలో ఉన్న టీమ్ ఇండియాకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? అనేది ఈ క‌థ‌నంలో చూద్దాం.

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లండ్ పాయింట్ల పట్టికలో 2 స్థానాలు ఎగబాకింది. గతంలో ఆరో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ జట్టు ఇప్పుడు నాలుగో స్థానానికి చేరుకుంది. ఇంగ్లండ్ నాలుగో స్థానానికి రావడంతో భారత జట్టుకు ఎలాంటి నష్టం ఉండ‌దు. పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.

ఇప్పుడు ఇంగ్లండ్‌ గెలుపు శాతం 41.07కి చేరింది. ఇంగ్లండ్ 2023-25 ​​సైకిల్‌లో ఇప్పటివరకు మొత్తం 14 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో వారు 7 గెలిచారు. 6 ఓడిపోయారు. 1 డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఓడిన శ్రీలంక ఐదో స్థానంలో ఉంది. శ్రీలంక ఇప్పటి వరకు 5 టెస్టులు ఆడగా అందులో 2 మ్యాచ్‌లు గెలిచి 3 ఓడింది. ఇప్పుడు శ్రీలంక- ఇంగ్లండ్ మధ్య మరో 2 టెస్టులు జరగాల్సి ఉంది. అందులో గెలవడం ద్వారా ఇరు జట్లు తమ తమ స్థానాలను మరింత మెరుగుపరుచుకోవచ్చు.

Also Read: Healthy Kidney: మ‌న కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 ప‌నులు చేయాల్సిందే..!

పట్టికలోని టాప్ 5 జట్లు ఇవే

ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​సైకిల్‌లో పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. భారత్‌లో 68.52 విజయ శాతం ఉంది. టీమ్ ఇండియా 9 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 6 గెలిచింది. 2 ఓడిపోయి 1 డ్రాగా ముగిసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా 62.50 విజయ శాతంతో రెండో స్థానంలో ఉంది. దీని తర్వాత న్యూజిలాండ్ 50.00 శాతం విజయంతో మూడో స్థానంలో, ఇంగ్లండ్ 41.07 శాతం విజయంతో నాలుగో స్థానంలో, శ్రీలంక 40.00 శాతం విజయంతో ఐదో స్థానంలో ఉన్నాయి.

We’re now on WhatsApp. Click to Join.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో ఏ జట్టు అయినా మ్యాచ్ గెలిస్తే 12 పాయింట్లు సాధిస్తుంది. మ్యాచ్ టై అయితే 6 పాయింట్లు, డ్రా అయితే 4 పాయింట్లు, ఓడిపోతే పాయింట్లు ఇవ్వరు. ఇదే సమయంలో పాయింట్ల శాతం గురించి మాట్లాడినట్లయితే.. గెలిస్తే 100 పాయింట్లు, టై అయితే 50, డ్రా అయితే 33.33, ఓడిపోతే పాయింట్లు ఇవ్వబడవు. పాయింట్ల శాతం ఆధారంగా టాప్-2 జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.