World Cup 2023: అక్టోబర్ 5వ తేదీ నుంచి 2023 వన్డే ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇందుకోసం పది జట్లు బరిలోకి దిగుతున్నాయి.ఇప్పటికే వార్మప్ మ్యాచ్ లు ప్రారంభమయ్యాయి. మెగా టోర్నీ ప్రారంభానికి ఎక్కువ సమయం లేకపోవడంతో ఆయా జట్ల బలాబలాలపై క్రిటిక్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ నిపుణులు ఎవరి బలం మరియు బలహీన ఏంటని లెక్కలేస్తున్నారు. టైటిల్ ఫెవరెట్ జట్లలో చోటు సంపాదించుకున్న పాకిస్థాన్ జట్టు స్థితిగతులు ఎలా ఉన్నాయో చూద్దాం.
పాకిస్థాన్ ప్రధాన బలం బౌలింగ్. పాక్ బౌలర్లు తమ బౌలింగ్ తో మ్యాచ్ తిప్పేయగలరు. కొన్నేళ్ళనుంచి పాకిస్థాన్ జట్టు తమ బౌలర్లనే నమ్ముకుంటూ వస్తున్నది. ప్రపంచ కప్ లాంటి ప్రెస్టీజియస్ టోర్నీలో పాక్ బౌలింగ్ ఎటాక్ బలంగా ప్రభావితం చేయగలదు. ఈ సారి వాళ్ళ బౌలింగ్ ఎటాక్ లో బాబర్ అజమ్ చేరిపోయాడు. నిజానికి బాబర్ అజమ్ వరల్డ్ నంబర్ వన్డే బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు.వన్డేల్లో చాలా నిలకడగా పరుగులు చేసే సామర్ధ్యం ఉంది. బాబర్ కి మిగితా బ్యాటర్ల నుంచి కాస్త సపోర్ట్ లభిస్తే.స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించగలడు. బాబర్ స్టాండ్ ఇస్తే మాత్రం పాక్ జట్టు డేంజరస్‌గా మారడం ఖాయం. బాబర్‌తో పాటు రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ సైతం మంచి ఫామ్‌లో ఉండటం పాక్‌కు కలిసొచ్చే అంశం.
పాకిస్థాన్ ప్రధాన బలం బౌలర్లే అయినప్పటికీ పేసర్ నసీమ్ షా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. షా లేని లోటు పాక్ జట్టులో స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో బౌలింగ్ ఎటాక్ వీక్ గా మారే అవకాశముంది. నిజానికి పాకిస్థాన్ ఓ విషయంలో ఎప్పటినుంచో ఓ బ్లండర్ మిస్టేక్ చేస్తూ వస్తుంది. బాబర్ అజమ్, బౌలర్లు షాహీన్ షా అఫ్రిదీ, హరీస్ రౌఫ్ ఆటగాళ్లని నమ్ముకుంటూ వస్తుంది. వారిలో ఒకరిద్దరు విఫలమైతే జట్టులోని సభ్యులు ఒక్కొక్కరు చాప చుట్టేస్తారు. ఇక మనోళ్లు మిడిల్డార్ అంత గొప్పగా ఎం లేదు. షాదాబ్ ఖాన్ ఫామ్‌లో లేకపోవడం పాక్ మిడిల్డార్‌ను వీక్ చేస్తోంది. ఇక పాక్ ఆటగాళ్లకు అతిపెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే ఫీల్డింగ్ అని చెప్పొచ్చు. పేలవమైన ఫీల్డింగ్ తో మ్యాచ్ అవకాశాలను కోల్పోతుండటం కూడా మైనస్ అవుతుంది.
Also Read: KCR Wanted NDA: బీజేపీలోకి కేసీఆర్..? మోడీ షాకింగ్ కామెంట్స్
