Site icon HashtagU Telugu

Google Doodle : గూగుల్ డూడుల్ చూశారా ? గుకేష్ దొమ్మరాజు, డింగ్ లిరెన్‌‌లకు అరుదైన గౌరవం

Google Doodle World Chess Championship 2024 D Gukesh Ding Liren

Google Doodle : ప్రతిరోజూ ‘గూగుల్ సెర్చ్’ హోం పేజీలో పబ్లిష్ అయ్యే ‘గూగుల్ డూడుల్’ గురించి మనకు తెలుసు. గూగుల్ డూడుల్ ప్రతిరోజూ స్పెషలే. ఎందుకంటే ప్రతి రోజూ భిన్నమైన గూగుల్ డూడుల్‌ను డిస్‌ప్లే చేస్తారు. తాజాగా ఇవాళ (నవంబరు 25న) చెస్ గేమ్‌కు సంబంధించిన డూడుల్‌ను గూగుల్ ప్రచురించింది.  ‘ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్ – 2024’ ఇవాళ సింగపూర్‌లో ప్రారంభం అవుతోంది. దీన్ని పురస్కరించుకొని చెస్ కాయిన్స్‌తో ఆకట్టుకునే డూడుల్‌ను గూగుల్(Google Doodle) తయారు చేయించింది.  దీని ద్వారా ఈసారి ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో తలపడుతున్న గుకేష్ దొమ్మరాజు (భారత ప్లేయర్), డింగ్ లిరెన్‌ (చైనా ప్లేయర్)‌లను సత్కరించింది. భారతదేశం తరఫున ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో  డి. గుకేష్ పాల్గొంటున్నారు. ఆయన ప్రస్తుత చెస్ వరల్డ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్‌తో గేమ్‌లో తలపడుతున్నారు. పద్దెనిమిదేళ్ల భారత గ్రాండ్‌మాస్టర్ గుకేష్ దొమ్మరాజు ఫిడే (FIDE) వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా రికార్డులకు ఎక్కారు. కాగా, డిసెంబరు 13 వరకు సింగపూర్‌లో ఈ పోటీలు కొనసాగుతాయి.

Also Read :MLC Kavitha : తెలంగాణలో ‘కుల గణన’ కోర్టుల్లో నిలుస్తుందా.. సర్కారు చెప్పాలి : కవిత

చెస్ వరల్డ్ ఛాంపియన్‌‌షిప్ ఇలా జరుగుతుంది ?

Also Read :Dogs Care Centers : కుక్కల కోసం ప్రతి జిల్లాలో సంరక్షణ కేంద్రం.. సర్కారు యోచన