Women’s IPL: ముంబై బోణీ అదుర్స్

మహిళల ఐపీఎల్ ను టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ అదిరిపోయే విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై భారీ గెలుపును అందుకుంది.

  • Written By:
  • Publish Date - March 5, 2023 / 11:51 AM IST

మహిళల  ఐపీఎల్ (Women’s IPL) ను టైటిల్ ఫేవరెట్ ముంబై ఇండియన్స్ అదిరిపోయే విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై భారీ గెలుపును అందుకుంది. 143 ప‌రుగులు తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియ‌న్స్ 207 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ యాస్తికా భాటియా నిరాశ‌ప‌రిచినా.. ధాటిగా ఆడారు. మ్యాథ్యూస్ 31 బాల్స్‌లో నాలుగు సిక్స‌ర్లు, మూడు ఫోర్ల‌తో 47 ర‌న్స్ చేసింది. త‌ర్వాత కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో చెలరేగిపోయింది. కేవలం 30 బంతుల్లోనే 14 ఫోర్ల‌తో 65 ప‌రుగులు చేసింది. చివర్లో అమెలియా కెర్ కూడా రాణించ‌డంతో ముంబై భారీ స్కోరు సాధించింది.గుజ‌రాత్ జెయింట్స్ బౌల‌ర్ల‌లో స్నేహ్ రాణా 2 వికెట్లు పడగొట్టింది.

భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో గుజ‌రాత్ జెయింట్స్ పూర్తిగా చేతులెత్తేసింది. 15.1 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 64 ప‌రుగుల‌కే కుప్పకూలింది. గుజరాత్ జెయింట్స్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ బెత్ మూనీ.. నాట్ సివర్ బౌలింగ్‌లో తీవ్రంగా గాయపడింది. దాంతో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగింది. బెత్ మూనీ వెనుదిరిగిన వెంటనే గుజరాత్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. హేమ‌ల‌త మిన‌హా మిన‌హా మిగిలిన ప్లేయ‌ర్లు ఘోరంగా విఫలమయ్యారు. హేమ‌ల‌త త‌ర్వాత ప‌ద‌కొండో నంబ‌ర్ బ్యాటర్ మోనిక ప‌టేల్ 10 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచింది. గుజ‌రాత్ జెయింట్స్ ఇన్నింగ్స్‌లో వీరిద్ద‌రే రెండంకెల స్కోరు చేశారు. ముంబై ఇండియ‌న్స్ బౌల‌ర్ల‌లో సైకా ఇషాక్ నాలుగు వికెట్ల‌తో చెలరేగితే.. బ్రంట్, కెర్ త‌లో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read:  Women’s IPL Preview: ఇక అమ్మాయిల ధనాధన్