ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో రెండు వరుస పరాజయాల తర్వాత పంజాబ్ ను నిలువరించి తొలి విజయాన్ని రుచి చూసిన సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మరో ఆసక్తికరపోరుకు సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ పై అద్భుత విజయాన్ని అందుకుని బోణీ కొట్టిన హైదరాబాద్ తమ జోరు కొనసాగించాలని భావిస్తోంది. ఈ మ్యాచ్ కు సంబంధించి సన్ రైజర్స్ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశముంది.
ఈడెన్ గార్డెన్స్ పిచ్ ను దృష్టిలో ఉంచుకుని ఒక ఎక్స్ ట్రా స్పిన్నర్ తో బరిలోకి దిగనుంది. కాగా బ్యాటింగ్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. 13.25 కోట్లు పెట్టిన కొన్న హ్యారీ బ్రూక్ మూడు మ్యాచ్ లల్లోనూ నిరాశపరిచాడు. దీంతో బ్రూక్ ను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠీ మెరుపు ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి వచ్చాడు. 48 బంతుల్లోనే 74 రన్స్ చేసాడు. అటు మయాంక్ కూడా పూర్తి ఫామ్ లోకి వస్తే భారీస్కోరుకు ఛాన్సుంటుంది. క్లాసెన్, మర్క్ రమ్ కూడా సన్ రైజర్స్ బ్యాటింగ్ లో కీలకంగా ఉన్నారు. వీరిద్దరిపైనా అంచనాలున్నాయి. అబ్దుల్ సమద్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకునే అవకాశముంది.
Also Read: Ravichandran Ashwin: రవిచంద్రన్ అశ్విన్ కి భారీ షాక్.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత..!
మరోవైపు బౌలింగ్ లో పేసర్లు భువనేశ్వర్ , ఉమ్రాన్ మాలిక్, నటరాజన్ లపై అంచనాలున్నాయి. భువి పెద్దగా ప్రభావం చూపకున్నా.. ఉమ్రాన్ మాలిక్ , నట్టూలపై అంచనాలున్నాయి. అటు స్పిన్నర్లుగా వాషింగ్ట్ సుందర్, మయాంక్ మర్కాండే బరిలోకి దిగనున్నారు. ముఖ్యంగా గత మ్యాచ్ తో సన్ రైజర్స్ తరపున అరంగేట్రం చేసిన మర్కాండే 4 కీలక వికెట్లతో అదరగొట్టాడు. అలాగే మార్కో జెన్సన్ కూడా రాణిస్తుండడంతో సన్ రైజర్స్ కు ఎటువంటి టెన్షన్ లేదు.
ఇక తొలి మ్యాచ్ లో ఓడినప్పటకీ.. తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకున్న కోల్ కతా ఫుల్ జోష్ లో ఉంది. కోల్ కతా రెండు మ్యాచ్ లలో 200కు పైగా స్కోర్లు నమోదు చేసిందంటే వారి బ్యాటర్ల ఫామ్ అర్థమవుతోంది. ముఖ్యంగా గుజరాత్ పై రింకూ సింగ్ అసాధారణ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు. పైగా ఆడుతోంది వారి హౌంగ్రౌండ్ ఈడెన్ గార్డెన్స్ కావడంతో చెలరేగిపోయే అవకాశముంది. ఓపెనర్ గుర్బాజ్, వెంకటేశ్ అయ్యర్ ,నితీశ్ రాణాతో పాటు రింకూ సింగ్ లాంటి హిట్టర్ ఉండడం అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు. ఫామ్ లో ఉన్న కోల్ కతా బ్యాటింగ్ లైపన్ ను ఈడెన్ గార్డెన్స్ లో కట్టడి చేయడం సన్ రైజర్స్ బౌలర్లకు సవాలే. ఇదిలా ఉంటే ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటర్లకు అనుకూలిస్తుంది. తొలి మ్యాచ్ లో ఇక్కడ కెేకేఆర్ 207 రన్స్ చేసింది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశముంది.