World Cup 2023: అశ్విన్ ని ప్రపంచ కప్ లో ఆడిస్తారా?

టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 20 నెలల తరువాత జట్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపికైన అశ్విన్, వరల్డ్ కప్ సైతం ఆడనున్నట్లు తెలుస్తోంది.

World Cup 2023: టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ 20 నెలల తరువాత జట్టులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు ఎంపికైన అశ్విన్, వరల్డ్ కప్ సైతం ఆడనున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ అక్షర్ పటేల్ స్థానాన్ని భర్తీ చేయనున్నట్లు సమాచారం.ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో రెండో వన్డేలో అశ్విన్ మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. పైగా పరుగులు ఇవ్వకుండా పొదుపుగా బౌలింగ్ చేశాడు. అయితే ఇంత చేసినా అశ్విన్ కి ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోవచ్చని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ అశ్విన్ 15 మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకోకపోవచ్చని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇదే ఆరోన్ ఫించే గతంలో అక్షర్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. అక్షర్ జ‌ట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో త‌న వంతు స‌హ‌కారం అందిస్తాడని చెప్పాడు.

సన్నాహక మ్యాచ్ లో టీమిండియా ఆస్ట్రేలితో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్ లో రవిచంద్రన్ అశ్విన్ అద్భుతంగ రాణిస్తున్నాడు. ముఖ్యంగా రెండో వన్డేలో డేవిడ్ వార్నర్, మార్నస్ లాబుషాగ్నే, జోష్ ఇంగ్లిస్‌ల వికెట్ల పడగొట్టి సత్తా చాటాడు. తొలి వన్డేలో అశ్విన్ లాబుషాగ్నే వికెట్ తీసుకున్నాడు.దీంతో కంగారూ జట్టుపై అశ్విన్ 144 వికెట్లు సాధించాడు. అశ్విన్ ఇప్పటివరకు 113 వన్డే మ్యాచులు ఆడి 151 వికెట్లు నేలకూల్చాడు.బ్యాటింగ్‌లోనూ 86.96 స్ట్రైక్ రేటుతో 707 పరుగులు చేశాడీ స్పిన్ వీరుడు.

ప్రస్తుతం భారత జట్టులో కుల్దీప్ యాదవ్ మాత్రమే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా రాణిస్తున్నాడు. మరో స్పిన్నర్ జడేజా ఉన్నప్పటికీ అతడు ఆల్‌రౌండర్ గా కొనసాగుతున్నాడు. దీంతో అశ్విన్ సేవలు జట్టుకు ఎంతైనా అవసరం పడుతాయని మాజీలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి అశ్విన్ ను ప్రపంచ కప్ కు ఎంపిక చేయకుంటే బీసీసీఐ ఓ రేంజ్ లో విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 2011 ప్రపంచకప్ లో అశ్విన్‌కు ఆడే అవకాశం దక్కలేదు. ఇది చాలా మంది క్రికెట్ అభిమానులనే కాదు.. మాజీలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అశ్విన్‌కు అవకాశం ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని నెటిజన్లు ఖండించారు. భారత్‌లో ప్రపంచకప్‌ ఉన్నప్పటికీ అశ్విన్‌లాంటి అనుభవజ్ఞుడైన స్పిన్నర్‌కు ఎందుకు అవకాశం ఇవ్వలేదని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా సెలక్షన్ కమిటీని ప్రశ్నించారు. ఈ సారి అశ్విన్ సెలెక్ట్ కాకపోతే నెటిజన్స్ దాడికి సెలక్షన్ కమిటీ తట్టుకోవడం కష్టమే.

Also Read: Skanda : రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బిజినెస్.. స్కంద లెక్కలు ఎలా ఉన్నాయంటే..!!