RCB Target In IPL Auction: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన అద్భుతంగా ఉంది. జట్టు కష్టపడి ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే టైటిల్ గెలవాలనే కల RCBకి కలగానే మిగిలిపోయింది. గత సీజన్‌లో RCB వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ చాలా సంచలనాలు సృష్టించాడు. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుపడి మరీ పరుగులు సాధించాడు. అయితే ఈ సీజన్‌లో RCB చివరి మ్యాచ్ తర్వాత దినేష్ కార్తీక్ IPL నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీని తర్వాత IPL 2025లో RCB కొత్త వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎవరు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది? దీనికి సంబంధించి ఇప్పుడు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ (RCB Target In IPL Auction) పేరు తెరపైకి వస్తోంది. నివేదికల ప్రకారం.. మెగా వేలంలో RCB ఈ ఆటగాడిపై వేలం వేయవచ్చని సమాచారం.
ఆటగాడు దినేష్ కార్తీక్ స్థానాన్ని భర్తీ చేయగలడు
ఇటీవల ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరిగింది. ఆస్ట్రేలియా 3-0తో గెలిచింది. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు బ్యాట్స్‌మెన్‌ల తుఫాన్ శైలి కనిపించింది. తొలి మ్యాచ్ లో ట్రావిస్ హెడ్ , మిచెల్ మార్ష్ లు బౌలర్లను చిత్తు చేయగా, రెండో మ్యాచ్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ జోష్ ఇంగ్లిష్ అద్భుత సెంచరీతో గెలిపించాడు. రెండో టీ20 మ్యాచ్‌లో జోష్ ఇంగ్లీషు కేవలం 49 బంతుల్లో 103 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రెండో టీ20లో ఆస్ట్రేలియా 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Quickest hundreds for Australia in men's T20 internationals:
43 balls: Josh Inglis (2024)
47 balls: Aaron Finch (2013)
47 balls: Josh Inglis (2023)
47 balls: Glenn Maxwell (2023)
49 balls: Glenn Maxwell (2016)#SCOvAUS pic.twitter.com/Yf6LyKRf3d— cricket.com.au (@cricketcomau) September 6, 2024
జోష్ ఇంగ్లీషుపై RCB భారీ బిడ్‌కు సిద్ధం!
IPL నుండి దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు బలమైన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం వెతుకుతోంది. ఇలాంటి పరిస్థితిలో IPL 2025లో ఈ ఆస్ట్రేలియా పేలుడు వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌పై RCB భారీ ధరకు బిడ్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జోష్ ఇంగ్లిష్ ఆర్‌సిబిలో చేరితే జట్టు చాలా బలంగా మారుతుంది. ఎందుకంటే IPL 2024లో బ్యాటింగ్ చేయడం ద్వారా దినేష్ కార్తీక్ తనదైన ముద్ర వేశాడు. అలాంటి బ్యాట్స్‌మెన్ కోసం జట్టు వెతుకుతోంది. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మెగా వేలం వరకు ఆగాల్సిందే.