WI vs IND 2nd T20: రెండో టి20లో ఆడే టీమిండియా తుది జట్టు ఇదే

మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం చెందారు.

WI vs IND 2nd T20: మొదటి టీ20 మ్యాచ్ లో భారత్ పై వెస్టిండీస్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం చెందారు. హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ బ్యాటింగ్ ని ఝళిపించగా, మిగతా ప్లేయర్లు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయారు. భారీగా ఆశలు పెట్టుకున్న ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ చేతులెత్తేశారు. అలాగే హార్దిక్ పాండ్యా, సంజూ సామ్సన్, అక్షర్ పటేల్ లు వరుసగా పెవిలియన్ చేరారు. సూర్యకుమార్ యాదవ్ ఆడినా.. అది అతడి స్థాయి ఆట కాదు. ఈ మ్యాచ్ లో బౌలర్లను మెచ్చుకోవాల్సిందే. అర్ష్‌దీప్ సింగ్ తన పేస్ ఆధారంగా తనదైన ముద్ర వేయగలిగాడు. అదే సమయంలో ముఖేష్ కుమార్ కూడా ఆర్థికంగా బౌలింగ్ చేశాడు. స్పిన్‌ విభాగంలో కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ జోడీ కరీబియన్‌ బ్యాట్స్‌మెన్‌ను తమ పంథాలో డ్యాన్స్‌ చేసేలా చేసింది. అయితే రెండో టీ20లో కెప్టెన్ హార్దిక్ ప్లేయింగ్ ఎలెవన్‌ లో పెద్దగా మార్పులు చెయ్యట్లేదు. ఆదివారం విండీస్ తో భారత్ రెండో టీ20లో తలపడనుంది. అయితే రెండో మ్యాచ్ లోను జైస్వాల్ కు చోటు దక్కలేదు. యశస్వి జైస్వాల్ టీ20లో అరంగేట్రానికి మరికాస్త సమయం పెట్టె అవకాశం ఉంది.

రెండో టీ20 మ్యాచ్ లో భారత జట్టులో ఆడే ఆటగాళ్లలో ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్.

వెస్టిండీస్ తరుపున బ్రెండన్ కింగ్, కైల్ మేయర్స్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, అకిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్ బరిలోకి దిగనున్నారు.

Also Read: Chandrababu : చంద్రబాబు పోలీసులకు క్షమాపణలు చెప్పాలి.. పుంగ‌నూరు ఘ‌ట‌న‌పై పోలీసు సంఘం అధికారులు ఫైర్..