Rohit Sharma: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ మూడో టెస్టుకు సిద్దమవుతుంది. 14న ప్రారంభం కానున్న మూడో టెస్టు కోసం టీమిండియా బ్రిస్బేన్ కు బయలుదేరింది. అయితే జైస్వాల్ ను వదిలేసి రోహిత్ సేన మాత్రమే విమానాశ్రయానికి చేరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అంతేకాదు జైస్వాల్ చేసిన పనికి రోహిత్ (Rohit Sharma) చాలా సీరియస్ అయ్యాడట. ఇంతకీ ఏం జరిగిందంటే టీమ్ ఇండియా టీమ్ బస్సులో అడిలైడ్ హోటల్ నుండి బ్రిస్బేన్‌కు విమానాశ్రయానికి బయలుదేరినప్పుడు జైస్వాల్ సమయానికి అక్కడికి రాలేదట. చిర్రెత్తుకొచ్చిన రోహిత్ తన టీం తో కలిసి విమానాశ్రయానికి బయల్దేరారు. అయితే జైస్వాల్ రోడ్డు మార్గాన కారులో విమానాశ్రయానికి చేరుకున్నాడు.
ఇది చిన్న విషయమే అయినా ఇలా తరచుగా జరుగుతుండటంతోనే రోహిత్ సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఆటగాళ్లకు సమయంపాలన ఎంతో అవసరమో రోహిత్ పలు ఇంటర్వ్యూలో చెప్పాడు. సో జైస్వాల్ అలా ఆలస్యం చేయడంతో రోహిత్ కాస్త ఘాటుగానే స్పందించాల్సి వచ్చింది. పెర్త్ టెస్టులో భారత్ విజయంలో జైస్వాల్ కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసి తొలి వికెట్‌కు కేఎల్ రాహుల్‌తో కలిసి 201 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కానీ అడిలైడ్ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను ఫ్లాప్ అయ్యాడు. ఇది భారత జట్టుపై ప్రభావం చూపడంతో టీమ్ ఇండియా రెండో టెస్టులో ఓడిపోవాల్సి వచ్చింది. దీంతో సిరీస్ ఒకటి ఒకటితో సమమైంది.
Also Read: Rahane- Prithvi Shaw: ఫామ్ లోకి వచ్చిన పృథ్వీ షా.. రహానే బౌండరీల వర్షం
మూడో టెస్టులో విజయం సాధించడం ఇరు జట్లకు అత్యంత కీలకంగా మారింది. బ్రిస్బేన్ వేదికగా జరగనున్న మూడో టెస్టు భారత్‌కు అంత సులువు కాదని అంటున్నారు. బ్రిస్బేన్‌లోని ఫాస్ట్ పిచ్‌పై కంగారూ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌లను ఇబ్బంది పెట్టె ప్రమాదం ఉంది., అయితే టీమ్ ఇండియా బ్యాట్స్‌మెనలు క్రీజులో నిలదొక్కుకుని రాణిస్తే పరుగుల వరద పారడం ఖాయం. మూడో టెస్టులో యశస్వి జైస్వాల్ మంచి ఆరంభం ఇచ్చి భారీ స్కోర్ చేయాల్సిన అవసరముంది.