Site icon HashtagU Telugu

Kapil Dev: కపిల్ దేవ్, బీసీసీఐ మధ్య వివాదం ఏంటి?

Kapil Dev

Kapil Dev

Kapil Dev: ఐపీఎల్ కి ముందు ఇండియన్ క్రికెట్ లీగ్ ఏర్పాటైంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చెందిన సుభాష్ చంద్ర ఈ లీగ్‌ని ప్రారంభించారు. కపిల్ దేవ్ (Kapil Dev) ఈ లీగ్‌లో భాగమయ్యాడు. విదేశీ క్రికెటర్లు కూడా ఈ లీగ్ లో ఆడినవారే . కానీ బీసీసీఐ ఈ లీగ్‌ను గుర్తించలేదు. అయినప్పటికీ సుభాష్‌చంద్ర లీగ్‌ను ప్రారంభించారు. కానీ ఆ ఎఫెక్ట్ ఆటగాళ్లపై పడింది. బీసీసీఐని కాదని లీగ్లో ఆడిన వాళ్లపై బీసీసీఐ నిషేధం విధించింది. అందులో కపిల్ దేవ్ కూడా ఉన్నారు.

2007లో మొదలైన ఈ లీగ్ 2009 వరకు సాగింది. కానీ బీసీసీఐ అండ లేకపోవడంతో లీగ్ కనుమరుగైపోయింది. ఈ లీగ్‌ ఆడేందుకు కపిల్ కు మైదానాన్ని కూడా అందించలేదు బీసీసీఐ. బీసీసీఐ మొదటినుంచి కపిల్ దేవ్ ని వ్యతిరేకిస్తూనే ఉంది. గత ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కి కపిల్ దేవ్ కు ఆహ్వానం కూడా అందించలేదు. ఈ విషయంలో బీసీసీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కపిల్ దేవ్ కెప్టెన్సీలో భారత్ 1983 లో మొదటి ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. ఆ సమయంలో భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు కానీ కపిల్ కెప్టెన్సీలో సమీకరణలన్నీ మారిపోయాయి. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనాటి అత్యంత భయంకరమైన జట్టు వెస్టిండీస్‌ను ఫైనల్‌లో ఓడించి భారత్ కు తో టైటిల్ అందించాడు. ఆ ఫైనల్లో వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ను కపిల్ దేవ్ అందుకున్న తీరును క్రికెట్ అభిమానులు ఎప్పటికి మర్చిపోలేరు. ఈ విజయంతో భారత క్రికెట్ చరిత్ర మలుపు తిరిగింది.

Also Read: Ravi Shastri: దేశవాళీలో ఆడాలని రోహిత్‌-విరాట్‌లకు రవిశాస్త్రి సలహా

కపిల్ దేవ్ ప్రపంచంలోని గొప్ప కెప్టెన్లలో ఒకడు. అంతేకాదు గొప్ప ఆల్ రౌండర్ కూడా. తన బౌలింగ్ మరియు బ్యాటింగ్‌తో భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. భారత్ తరఫున 131 టెస్టు మ్యాచ్‌లు ఆడి 434 వికెట్లు పడగొట్టాడు. ఒకానొక సమయంలో అతను టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నాడు, ఆ తర్వాత దానిని వెస్టిండీస్‌కు చెందిన కోర్ట్నీ వాల్ష్ బద్దలు కొట్టాడు. వన్డేలో కపిల్ దేవ్ 225 మ్యాచ్‌లు ఆడాడు. 253 వికెట్లు మరియు 3783 పరుగులు చేశాడు. వన్డేలో ఒక సెంచరీ మరియు 14 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు టెస్టులో 5248 పరుగులు చేశాడు. దాంతోపాటు ఎనిమిది సెంచరీలు మరియు 27 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. అయితే .కపిల్ దేవ్ పాకిస్థాన్‌లో పుట్టాడన్న చాలా మందికి తెలియకపోవచ్చు. పాక్ లోని రావల్పిండి సమీపంలోని ఓ గ్రామంలో 1959 జనవరి 6న కపిల్ దేవ్ జన్మించాడు. దేశ విభజన సమయంలో వారి కుటుంబం భారత్‌కు వ‌ల‌స వ‌చ్చి చంఢీగడ్‌లో స్థిరపడింది.

Exit mobile version