Neeraj Chopra: పోలండ్‌లో జరిగే డైమండ్ లీగ్ 2025లో భారత స్టార్ జావెలిన్ క్రీడాకారుడు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) పాల్గొనడం లేదు. ఈ టోర్నమెంట్‌కు సంబంధించి అధికారికంగా విడుదలైన ఆటగాళ్ల జాబితాలో నీరజ్ చోప్రా పేరు, అలాగే పాకిస్తాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ పేరు కూడా లేకపోవడంతో వీరిద్దరూ ఈ టోర్నమెంట్‌లో పాల్గొనడం లేదని తెలుస్తోంది.
నీరజ్ చోప్రా ఎందుకు పాల్గొనడం లేదు?
పోలండ్‌లో జరిగే డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రా పాల్గొనకపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. అయితే, కొన్ని నివేదికల ప్రకారం సెప్టెంబర్ 17, 18 తేదీల్లో జరగనున్న టోక్యో అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పై దృష్టి సారించేందుకే నీరజ్ ఈ లీగ్‌లో పాల్గొనడం లేదని అంచనా. అతను చివరిసారిగా జూలై 5న ఎన్‌సీ క్లాసిక్ టోర్నమెంట్‌లో ఆడాడు. నీరజ్ చోప్రాకు ఎటువంటి గాయాలు కాలేదని, అతను ఫిట్‌గానే ఉన్నాడని నివేదికలు చెబుతున్నాయి. ఈవెంట్‌కు గైర్హాజరవడానికి ప్రధాన కారణం గాయం కాదని తెలుస్తోంది. టోక్యోలో జరగనున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కోసం నీరజ్ సన్నద్ధమవడం కోసం ఈ టోర్నీకి దూరమైనట్లు సమాచారం. ఈ 27 ఏళ్ల ఆటగాడు ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి తన శక్తిని ఆదా చేసుకుంటున్నాడని భావిస్తున్నారు.
Also Read: Hyderabad : అక్రమ సరోగసీ, ఎగ్ ట్రేడింగ్ ముఠా బట్టబయలు..తల్లి కొడుకులు అరెస్ట్
పాయింట్ల పట్టికపై ప్రభావం
నీరజ్ చోప్రా సిలేసియా డైమండ్ లీగ్‌ను వదిలివేసి వచ్చే నెలలో జరిగే వరల్డ్ ఛాంపియన్‌షిప్‌పై దృష్టి పెట్టడానికి మరొక కారణం అతని పాయింట్ల టేబుల్‌లోని స్థానం కావచ్చు. అతను ప్రస్తుతం 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. జూలియన్ వెబర్ కూడా 15 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నాడు.
ప్రస్తుతం డైమండ్ లీగ్ 2025 పాయింట్ల పట్టికలో నీరజ్ చోప్రా 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఒకవేళ అతను పోలండ్ ఈవెంట్‌లో పాల్గొనకపోతే టాప్-4 జాబితా నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం మొదటి స్థానంలో జూలియన్ బెబర్ ఉండగా, మూడో స్థానంలో ఆండర్సన్ పీటర్స్, నాలుగో స్థానంలో కేషోర్న్ వాల్‌కాట్ ఉన్నారు. ఈ క్రీడాకారులు పోలండ్ డైమండ్ లీగ్‌లో మెరుగ్గా రాణిస్తే.. వారు నీరజ్ చోప్రాను వెనక్కి నెట్టే అవకాశం ఉంది.