Indian Flag: ఇండియా ఫ్లాగ్ తో అఫ్రిది కుమార్తె

చిరకాల ప్రత్యర్థి భారత్ తో మ్యాచ్ అంటే పాకిస్థాన్ ఫాన్స్ తమ దేశపు జెండా తోనే హల్ చల్ చేస్తారు.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 12:27 PM IST

చిరకాల ప్రత్యర్థి భారత్ తో మ్యాచ్ అంటే పాకిస్థాన్ ఫాన్స్ తమ దేశపు జెండా తోనే హల్ చల్ చేస్తారు. పాక్ అభిమానుల చేతిలో భారత్ జెండా ఊహించగలమా…అందులోనూ ఒక సెలబ్రిటీ కుమార్తె ఇండియా ఫ్లాగ్ తో కనిపిస్తే చాలా అరుదైన ఘటనే అని చెప్పాలి. ఇలాంటి సీన్ భారత్, పాక్ ఆసియా కప్ మ్యాచ్ లో కనిపించింది. చాలా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో పాక్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది కుమార్తె భారత్ పతాకంతో కనిపించింది.

అఫ్రిది కుమార్తె ఇండియా ఫ్లాగ్ చేతితో పట్టుకుని ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పాక్ మాజీ క్రికెటర్ కుమార్తె భారత జెండా పట్టుకుని ఉండడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాజాగా దీనిపై అఫ్రిది స్పందించాడు. ఆ మ్యాచ్ కోసం స్టేడియంలో 90 శాతం భారత అభిమానులే ఉన్నారని, పాక్ ఫాన్స్ చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పాడు. అందుకే తన కుమార్తెకు పాక్ జెండా దొరకలేదని వివరణ ఇచ్చాడు. ఈ కారణంగానే ఇండియా ఫ్లాగ్ పట్టుకుందని అఫ్రిది క్లారిటీ ఇచ్చాడు. ఇంతకు మించి ఈ ఘటనలో మరేదీ లేదని ఈ మాజీ ప్లేయర్ స్పష్టం చేశాడు. సెప్టెంబర్ 4న జరిగిన ఈ మ్యాచ్ భారత్ పరాజయం పాలైంది.