Site icon HashtagU Telugu

SRH vs MI: హైదరాబాద్ వేదికగా నేడు మరో రసవత్తర మ్యాచ్.. జోరు మీదున్న ముంబై, హైదరాబాద్..!

SRH vs MI

Srh (1)

ఐపీఎల్ 16వ సీజన్ 25వ లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు తమ సొంత మైదానంలో ముంబై ఇండియన్స్ (MI) జట్టుతో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. మంగళవారం రాత్రి 7. 30 గంటలకు ఉప్పల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ రెండూ ఇప్పటివరకు 4-4 మ్యాచ్‌లు ఆడగా అందులో 2-2 మ్యాచ్‌లు గెలిచాయి.

ముంబై ఇండియన్స్ జట్టు ఈ సీజన్‌లో తమ ప్రారంభ 2 మ్యాచ్‌లలో వరుస పరాజయాలను ఎదుర్కొన్న తరువాత ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. గత 2 మ్యాచ్‌లలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్‌లను ఓడించింది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా ఆరంభం సరిగా లేకపోవడంతో తొలి 2 మ్యాచ్‌ల్లో ఏకపక్షంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత, జట్టు తమ మూడవ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి, ఆపై నాలుగో మ్యాచ్‌లో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులతో అద్భుత విజయం సాధించింది.

Also Read: MS Dhoni And Virat Kohli: ధోనీ, కోహ్లీలను చూసి ఫ్యాన్స్ ఖుష్.. మ్యాచ్ అనంతరం వీరిద్దరూ ముచ్చటిస్తున్న వీడియో వైరల్..!

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఇప్పటి వరకు 19 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో ముంబై జట్టు 10 సార్లు గెలుపొందగా, హైదరాబాద్ జట్టు 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్ పిచ్ గురించి మాట్లాడుకుంటే.. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఇక్కడ ఆడిన 2 మ్యాచ్‌లలో బ్యాటింగ్ చాలా సులభమైన పనిగా కనిపించింది. ఈ మ్యాచ్‌లోనూ అలాంటిదే కనిపిస్తుంది. గత 5 మ్యాచ్‌ల్లో ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 178 పరుగులకు చేరువైంది. ఇక ఈ మ్యాచ్ రిజల్ట్ గురించి మాట్లాడుకుంటే.. ఇరు జట్ల ఫామ్ చూస్తే గత కొన్ని మ్యాచ్ ల్లో అద్భుతంగా కనిపించింది. హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఖచ్చితంగా ముంబై కంటే కొంచెం బలంగా కనిపిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ మ్యాచ్‌లో టాస్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రెండు జట్లు లక్ష్యాన్ని ఛేదించడానికి ఇష్టపడతాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు (అంచనా): హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్ (C), అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్ (WK), మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, నటరాజన్

ముంబై ఇండియన్స్ జట్టు (అంచనా): ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ (C), సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, హృతిక్ షోకీన్, పీయూష్ చావ్లా, డువాన్ జాన్సెన్, రిలే మెరెడిత్