Asia Cup 2025: ఆసియా కప్ 2025 (Asia Cup 2025) కోసం భారత జట్టు ఎంపికపై క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఆగస్టు 19న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ జట్టును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో జట్టులోని ఆటగాళ్ల ఎంపిక, ప్లేయింగ్ ఎలెవన్ నిర్ణయం ఎవరి చేతుల్లో ఉంటాయనే అంశంపై స్పష్టత అవసరం.
స్క్వాడ్‌ను ఎంపిక చేసేది ఎవరు?
ఆసియా కప్‌తో పాటు ఏ ఇతర సిరీస్‌కైనా భారత జట్టు స్క్వాడ్‌ను ఎంచుకునే పూర్తి బాధ్యత సెలెక్షన్ కమిటీదే. ప్రస్తుతం ఈ కమిటీకి అజిత్ అగర్కర్ నాయకత్వం వహిస్తున్నారు. కాబట్టి ఆసియా కప్ 2025 కోసం భారత స్క్వాడ్‌లో ఏ ఆటగాళ్లకు చోటు దక్కాలి? ఎవరిని పక్కన పెట్టాలి అనే దానిపై అగర్కర్ సహా ఇతర సెలెక్టర్లు అందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఈ ఎంపిక ప్రక్రియలో ఆటగాడి ప్రస్తుత ఫామ్, ఫిట్‌నెస్, ఇటీవల మ్యాచ్‌ల్లో అతని ప్రదర్శన వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సాధారణంగా తుది నిర్ణయం సెలెక్షన్ కమిటీదే అయినప్పటికీ జట్టు కూర్పు (కాంబినేషన్) గురించి కోచ్, కెప్టెన్‌తో కూడా తరచుగా చర్చిస్తారు.
Also Read: Air Taxis: త్వరలో ఎగిరే కార్లు.. 2027 నాటికి సేవలు ప్రారంభం!
ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయించేది ఎవరు?
స్క్వాడ్ ఎంపిక సెలెక్షన్ కమిటీ చేతుల్లో ఉన్నప్పటికీ ఒక మ్యాచ్ కోసం తుది ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకునే అధికారం మాత్రం కోచ్, కెప్టెన్‌కు మాత్రమే ఉంటుంది. మైదానంలో జట్టును నడిపించే బాధ్యత కెప్టెన్‌పై ఉంటుంది కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్ ఎంపికలో అతని అభిప్రాయానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. మ్యాచ్ రోజు పిచ్ పరిస్థితి, ప్రత్యర్థి జట్టు బలం, ఆటగాళ్ల ఫామ్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్లేయింగ్ ఎలెవన్‌ను నిర్ణయిస్తారు.
సంజూ శాంసన్‌కు స్థానం పక్కా?
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా సంజూ శాంసన్‌కు దాదాపుగా స్థానం ఖాయమని భావిస్తున్నారు. అతని ఇటీవలి అద్భుతమైన ఫామ్, నైపుణ్యాలు దీనికి ప్రధాన కారణం. అతను ఓపెనర్‌గా లేదా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇది జట్టుకు ఎడమ-కుడి కాంబినేషన్, పవర్ హిట్టింగ్‌ను అందిస్తుంది. రెండవ వికెట్ కీపర్ స్థానం కోసం జితేష్ శర్మ, ధ్రువ్ జురెల్ మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ శాంసన్‌కే మొదటి ప్రాధాన్యత ఉంటుందని నివేదికలు సూచిస్తున్నాయి.