Trisha Gongadi: అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించడానికి 19 ఏళ్ల తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష (Trisha Gongadi) పోరాటం అద్భుతమైనది అని చెప్పుకోవచ్చు. 7 మ్యాచుల్లో 309 పరుగులు చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించింది. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. కేవలం బ్యాటింగ్‌లోనే కాదు బౌలింగ్‌లోనూ సత్తా చాటి 7 వికెట్లు తీసింది. భద్రాచలంకు చెందిన త్రిష ఈ వరల్డ్ కప్‌లో సత్తా చాటి అందరి చూపు తనవైపు పడేలా చేసింది.
ఎవరీ తెలుగమ్మాయి?
త్రిష గొంగడి ఇటీవల అండర్ 19 మహిళల T20 ప్రపంచకప్‌లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించిన భారతీయ మహిళా క్రికెటర్. 19 ఏళ్ల త్రిష గొంగడి ఈ ఘనత సాధించిన తర్వాత అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన తొలి మహిళా బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించింది. 2025 జనవరి 28న స్కాట్లాండ్‌తో జరిగిన సూపర్-6 మ్యాచ్‌లో ఆమె 59 బంతుల్లో 110 పరుగులు చేయడంతో స్టార్‌గా మారిపోయింది. ఇందులో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. త్రిష గొంగడి కథ యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలంకు చెందిన త్రిష గొంగడి చిన్న వయసులోనే మహిళా క్రికెట్‌లో చరిత్రాత్మక విజయాలు సాధించింది. త్రిష గొంగడి గురించి తెలుసుకుందాం.
Also Read: Dry Port In Telangana : తెలంగాణలోనూ డ్రై పోర్ట్ నిర్మాణం.. ఇంతకీ అదేమిటి ?
గొంగడి త్రిష తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి. 12 ఏళ్ల వయసులోనే హైదరాబాద్ మహిళల జట్టుకు ఎంపికైన త్రిష, చిన్న వయసులోనే బీసీసీఐ ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును కూడా గెలుచుకుంది. లెగ్ స్పిన్నర్ అయిన త్రిష, బ్యాటింగ్ లోనూ తన పవర్ హిట్టింగ్ తో రాణిస్తూ ఆల్ రౌండర్ గా పేరు సంపాదించింది. బౌలింగ్ లో అత్యధిక డాట్ బాల్స్ రికార్డును కూడా నెలకొల్పింది.
India wins Women U19 T20 WorldCup .
Trisha Gongadi is star with 44runs of 33 balls with bat and 3/15 with ball.#U19WomensWorldCup #GongadiTrisha pic.twitter.com/iVoBmBTB4K— Shailendra Yadav (@YadavJi_KaBeta) February 2, 2025
టీమిండియా అండర్-19 క్రికెట్ జట్టుకు ఎంపికై 2022 నవంబరు 27 నుండి డిసెంబరు 6 వరకు న్యూజిలాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడింది. మహిళల టీమ్ మాజీ కెప్టెన్, హైదరాబాదీ మిథాలీ రాజ్ తర్వాత తెలంగాణ నుంచి భారత జట్టులో స్థానం దక్కించుకొన్న క్రీడాకారిణిగా త్రిష నిలిచింది. 2023లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.
మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచే క్రికెట్ పై ఆసక్తితో క్రికెట్ లో మెళకువలు నేర్చుకుంది. ఎనిమిదేళ్ళ వయసులోనే ప్రతిభ చూపి జిల్లా స్థాయి అండర్-16 జట్టుకు ఆడి ఉమెన్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైంది. ఆ తరువాత 12 ఏళ్ళ వయసులో అండర్-19 జట్టుకు ఆడింది. 2021 మహిళల ప్రపంచ కప్ కోసం బీసీసీఐ అత్యుత్తమ ఆటగాళ్ళ ఎంపికకు నిర్వహించిన ప్రత్యేక టోర్నీలో ఇండియా-బి జట్టుకు ఆడి ప్రతి మ్యాచ్‌లోనూ బౌలింగ్, బ్యాటింగ్‌లో మంచి గణాంకాలతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి అండర్-19 వరల్డ్ కప్ మహిళల జట్టుకి ఎంపికయింది.