Olympics: పారిస్ ఒలింపిక్స్ (Olympics)లో మను భాకర్ చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి దక్షిణ కొరియాను 16-10 తేడాతో ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అంతకుముందు మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్వతంత్ర భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. అయితే 1900 గేమ్స్ సమయంలో అథ్లెటిక్స్‌లో భారత్ అథ్లెట్ రెండు రజత పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. కాబట్టి ఆ అథ్లెట్ గురించి తెలుసుకుందాం.
స్వతంత్ర భారత తొలి అథ్లెట్‌గా నిలిచారు
పారిస్ ఒలింపిక్స్‌లో మను రెండు కాంస్య పతకాలు సాధించింది. దీంతో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన స్వతంత్ర భారత తొలి అథ్లెట్‌గా రికార్డు సృష్టించింది. ముందు నార్మన్ ప్రిచర్డ్ 1900 గేమ్స్‌లో రెండు రజత పతకాలను గెలుచుకున్నాడు. అప్పుడు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది.
Also Read: IND vs SL 3rd T20: చేతులెత్తేసిన టీమిండియా, శ్రీలంక లక్ష్యం 138 పరుగులు
భారత్‌కు రెండు పతకాలు అందించిన విదేశీ క్రీడాకారుడు
1900లో జరిగిన ఒలింపిక్స్‌లో భారత్ తొలిసారిగా పతకం సాధించింది. 1900లో జరిగిన ఒలింపిక్స్‌లో భారతదేశం తొలిసారిగా ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంది. భారత్ తన తొలి ఒలింపిక్స్‌లోనే రెండు పతకాలు సాధించింది. ఈ రెండు పతకాలను నార్మన్ ప్రిచర్డ్ భారత్‌కు అందించారు. నార్మన్ ప్రిచర్డ్ బ్రిటిష్ ఇండియన్ కావడం గమనార్హం. అతను జూన్ 23, 1877న కోల్‌కతాలో జన్మించాడు. 200 మీటర్ల రేసు, 200 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకాలు సాధించాడు.
We’re now on WhatsApp. Click to Join.
అతను పారిస్ ఒలింపిక్స్ 1900లో 60 మీటర్లు, 100 మీటర్లు, 200 మీటర్లు, 110 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్ రేసుల్లో పాల్గొన్నాడు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన మొదటి వ్యక్తి మాత్రమే కాదు.. మొదటి ఆసియన్ కూడా. అతని హోమ్ క్లబ్ ప్రెసిడెన్సీ అథ్లెటిక్ క్లబ్ బెంగాల్. ఈ కారణంగానే ఐఓసీ ఆ పతకాలను భారత్‌కు అందజేసింది. హాలీవుడ్ సినిమాల్లో కూడా పనిచేశాడు. ‘బ్యూ గెస్టే’, ‘మ్యాడ్ అవర్’ వంటి హిట్ చిత్రాలకు పనిచేశాడు. అతని తర్వాత ఒలింపిక్స్‌లో భారత్ తరపున రెండు పతకాలు సాధించిన మహిళగా మను భాకర్ రికార్డు క్రియేట్ చేసింది.