IPL 2024 Auction: ఐపీఎల్ వేలంలో ఈ బ్యూటిఫుల్ లేడీ ఎవరు ?

16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఐపీఎల్‌ వేలం ప్రక్రియను ఓ మహిళ నిర్వహించింది. ఈసారి వేలాన్ని మల్లిక సాగర్‌ అడ్వానీ అనే మహిళ నిర్వహిస్తుంది. 48 ఏళ్ల మల్లికా సాగర్‌ ముం‍బైకు చెందిన ఓ ఆర్ట్‌ కలెక్టర్‌.

IPL 2024 Auction: 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఐపీఎల్‌ వేలం ప్రక్రియను ఓ మహిళ నిర్వహించింది. ఈసారి వేలాన్ని మల్లిక సాగర్‌ అడ్వానీ అనే మహిళ నిర్వహిస్తుంది. 48 ఏళ్ల మల్లికా సాగర్‌ ముం‍బైకు చెందిన ఓ ఆర్ట్‌ కలెక్టర్‌. ప్రస్తుతం ఆమె మోడ్రన్‌ అండ్‌ కాన్‌టెంపరరీ ఇండియన్‌ ఆర్ట్‌ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్‌ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.

వేలం నిర్వహించడంలో మల్లికకు అనుభవం ఉంది. 20ఏళ్లగా వేలం నిర్వాహకురాలిగా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఆమె తన కెరీర్ లో 2500 వేర్వేరు వేలం కార్యక్రమాలను నిర్వహించింది. 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలంలో తన వాక్‌ చాతుర్యంతో అందరిని అకట్టుకుంది. ఆ తర్వాత మహిళల ప్రీమియర్‌ లీగ్‌ తొలి సీజన్‌కు సంబంధించిన వేలాన్ని కూడా మల్లిక నిర్వహించింది. డిసెంబర్‌ 9న ముంబై వేదికగా జరిగిన వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ వేలంలో కూడా మల్లికా ఆక్షనీర్‌గా వ్యవహరించింది. ఇప్పుడు ఐపీఎల్‌ వేలాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఐపీఎల్ ఆరంభ సీజ‌న్ 2008 నుంచి 2018 వ‌ర‌కు రిచ‌ర్డ్ మాడ్లీ ఆక్ష‌నీర్‌గా కొన‌సాగారు. ఆ త‌రువాత 2018 నుంచి హ్యు ఎడ్మిడ్స్ వేలాన్ని నిర్వ‌హించారు. అయితే 2022 వేలం మ‌ధ్య‌లో ఆయ‌న అనారోగ్యానికి గురి కావ‌డంతో చారు శ‌ర్మ మిగ‌తా వేలాన్ని కొన‌సాగించారు. ఈ ఏడాది ఐపీఎల్ జట్లలో 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. వీటి కోసం 12 దేశాల నుంచి 333 మంది క్రికెటర్లు పోటీ పడ్డారు.

Also Read: Amardeep Chowdary: నేనొక్కడినే ఉన్నప్పుడు రండి చూసుకుందాం