world cup 2023: హార్దిక్ స్థానంలో చోటు దక్కేది ఎవరికీ?

రేపు ఆదివారం ధర్మశాల మైదానంలో ఆతిథ్య భారత జట్టు, రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు అసలైన పరీక్ష ఎదురుకానుంది.

Published By: HashtagU Telugu Desk
World Cup 2023 (42)

World Cup 2023 (42)

world cup 2023: రేపు ఆదివారం ధర్మశాల మైదానంలో ఆతిథ్య భారత జట్టు, రన్నరప్‌ న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు అసలైన పరీక్ష ఎదురుకానుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. హార్దిక్ పాండ్యా స్థానంలో ఎవరనేది రోహిత్ శర్మ మరియు భారత జట్టు మేనేజ్‌మెంట్ ముందున్న పెద్ద ప్రశ్న.

ధర్మశాల పిచ్‌ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి మహ్మద్ షమీకు టీమిండియా తుది జట్టులో అవకాశం కల్పించే అవకాశం ఉంది. మహ్మద్ షమీ జట్టులో అనుభవజ్ఞుడైన బౌలర్. షమీ రాకతో బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టంగా మారొచ్చని అభిప్రాయాలూ వ్యక్తం చేస్తున్నారు. సూర్యకుమార్ యాదవ్ మిడిలార్డర్‌లో జట్టుకు విలువైన సహకారం అందించగలడు. అలాగే జట్టుకు అవసరమైనప్పుడు చివరి ఓవర్లలో భారీ పరుగులు రాబడతాడు. శార్దూల్ ఠాకూర్ కి రెస్ట్ ఇచ్చిటీమిండియా  జట్టులోకి సూర్యకుమార్ యాదవ్ బెస్ట్ ఆప్షన్గా పరిగణిస్తున్నారు. ఇషాన్ కిషన్ కూడా లైన్ లో ఉన్నాడు. స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో అశ్విన్‌ సహకరించగలడు. జట్టుకు అవసరమైనప్పుడు కీలకమైన పరుగులు సాధించే సామర్ధ్యం ఉంది.  మరి ధర్మశాల మైదానంలో జరిగే మ్యాచ్‌లో ఎవరికి అవకాశం దక్కుతుందో చూడాలి.

Also Read: Bigg Boss : కుండ బద్దలు కొడుతూ..హౌస్ సభ్యుల ఫై నాగ్ సీరియస్

  Last Updated: 21 Oct 2023, 06:15 PM IST