WTC Final 2023: రేపే ప్రారంభం కానున్న డబ్ల్యూటీసీ లీగ్.. హాట్‌స్టార్ లైవ్ స్ట్రీమింగ్‌

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం నుంచి లండన్‌లోని ఓవల్‌ మైదానంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న భారత జట్టు ప్రస్తుతం మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది.

WTC Final 2023: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా బుధవారం నుంచి లండన్‌లోని ఓవల్‌ మైదానంలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న భారత జట్టు ప్రస్తుతం మ్యాచ్ కోసం సన్నద్ధమవుతోంది. భారత ఆటగాళ్ల సన్నాహాలను బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు పంచుకునే ఉంటుంది.

డబ్ల్యూటీసీ లీగ్ పట్టికలో ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాకు 152 పాయింట్లు ఉన్నాయి. అదే సమయంలో భారత జట్టు 127 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా జట్టు తొలిసారిగా WTC ఫైనల్‌కు చేరుకుంది. అదే సమయంలో భారత జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. డబ్ల్యూటీసీ తొలి ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో టీమ్ ఇండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

డబ్ల్యూటీసీ ఫైనల్ 2023 భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య బుధవారం నుండి అంటే జూన్ 7వ తేదీ నుండి ఓవల్ మైదానంలో మ్యాచ్ జరగనుంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. అంతేకాకుండా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యాప్‌లో ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్‌ చూడవచ్చు.

Read More: WTC Final 2023: ఇంగ్లండ్ ఓవల్‌ పిచ్ రిపోర్ట్